బాలరాముణ్ణి దర్శించుకున్న గాయని కవితా కృష్ణమూర్తి! | Kavita Krishnamurthy Reached Ayodhya | Sakshi
Sakshi News home page

Ayodhya: బాలరాముణ్ణి దర్శించుకున్న గాయని కవితా కృష్ణమూర్తి!

Feb 29 2024 7:09 AM | Updated on Feb 29 2024 7:09 AM

Kavita Krishnamurthy Reached Ayodhya - Sakshi

అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు ప్రతిష్ఠితుడయ్యాక రామభక్తులంతా రామ్‌లల్లాను దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ప్రతిరోజూ లక్షలాది మంది రామభక్తులు  అయోధ్యకు తరలివస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయకురాలు, పద్మశ్రీ  కవితా కృష్ణమూర్తి అయోధ్యకు వచ్చి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యకు వచ్చి, ఇక్కడ పాటలు పాడే అదృష్టం తనకు దక్కిందని, ఇందుకు దేవునికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. అయోధ్య  అభివృద్ధిపై సంతోషం వ్యక్తం చేసిన ఆమె రానున్న  ఐదేళ్లలో అయోధ్య ను కొత్త కోణంలో చూడనున్నామన్నారు. ఇక్కడికి కళాకారులు తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement