కమల్‌ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు చివాట్లు | Karnataka HC slams Kamal Haasan | Sakshi
Sakshi News home page

కమల్‌ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు చివాట్లు

Jun 3 2025 1:24 PM | Updated on Jun 3 2025 3:32 PM

Karnataka HC slams Kamal Haasan

సాక్షి,బెంగళూరు: ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ను కర్ణాటక హైకోర్టు చివాట్లు పెట్టింది. ‘మీరేమైనా చరిత్రకారులా అంటూ మండిపడింది. ప్రజలకు క్షమాపణలు చెబితే సరిపోతుంది కదా. కానీ మీరు రక్షణ కావాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారని వ్యాఖ్యానించింది. 

జూన్‌ 5న థగ్‌లైఫ్‌ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కన్నడ భాష.. తమిళం నుంచి పుట్టిందని కమల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ కన్నడ మద్దతు దారులు ఆయనకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్షణ కల్పించాలని కోరుతూ కమల్‌ హాసన్‌ కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. 

విచారణలో భాగంగా కమల్‌ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు ధర్మాసనం సీరియస్‌ అయ్యింది. ‘మీరు కమల్‌ హాసన్‌ అయితే కావొచ్చు ప్రజల మనోభావాలు దెబ్బ తీయోచ్చా?. ప్రజలు మిమ్మల్ని క్షమాపణలు చెప్పమనే కోరారు.. కానీ మీరు థగ్‌ లైఫ్‌ సినిమా విడుదల విషయంలో రక్షణ కల్పించాలని ఇక్కడి వచ్చారు. సినిమా సాఫీగా విడుదల కావాలంటే క్షమాపణ చెబితే సరిపోతుంది కదా.

మీరు కన్నడ భాష.. తమిళం నుంచి పుట్టిందని స్టేట్మెంట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ.. ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కన్నడిగుల మనోభావాలో తక్కువగా అంచనా వేశారు. 75ఏళ్ల క్రితం ఇలాంటి వ్యాఖ్యలే చేసినా శ్రీరాజగోపాలకృష్ణ చార్య క్షమాపణలు చెప్పారు. మీరూ క్షమాపణలు చెప్పండి అని సూచించింది.

అందుకు తన స్టేట్మెంట్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ కమల్‌ హాసన్‌ తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కమల్‌ హాసన్‌ తప్పని సరిగా ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని సూచించింది.

నటుడు కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్

Advertisement
 
Advertisement
Advertisement