ఇండియా కూటమిలో చేరికపై కమల్‌ హాసన్‌ స్పందన

Kamalhasan Comments On Joining India Bloc - Sakshi

చెన్నై: స్వార్థరహితంగా ఆలోచించే  ఏ కూటమితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడుకు చెందిన ఎమ్‌ఎన్‌ఎమ్‌ పార్టీ చీఫ్‌ కమల్‌హాసన్‌ తెలిపారు.  ఇండియా కూటమిలో చేరతారా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఇప్పటివరకైతే ఇండియా కూటమిలో తాము భాగస్వాములం కాదని స్పష్టం చేశారు.

ఏ కూటమిలో చేరినా స్థానిక ఫ్యూడల్‌ శక్తులతో కలిసి మాత్రం పనిచేయబోమని చెప్పారు. స్టాలిన్‌కు చెందిన డీఎంకే పార్టీతో కమల్‌హాసన్‌ కలిసి పనిచేయబోతున్నారన్న పుకార్లు ఇటీవలి కాలంలో  ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కమల్‌ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశమైంది. స్టార్‌ హీరో విజయ్‌ రాజకీయాల్లోకి రావడాన్ని కమల్‌హాసన్‌ ఈ సందర్భంగా స్వాగతించారు. 

ఇదీ చదవండి.. గగన్‌యాన్‌పై ఇస్రో కీలక అప్‌డేట్‌

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top