
రామ్‌గఢ్: జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక బొగ్గు గనిలో కొంత భాగం కూలిపోవడంతో ఒకరు మృతిచెందారు. వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం గనిలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
One killed, many feared trapped after portion of coal mine collapses in Jharkhand's Ramgarh: Police. pic.twitter.com/m7sQrlflqk
— Press Trust of India (@PTI_News) July 5, 2025
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రామ్‌గఢ్ జిల్లాలోని కర్మ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి తెలియగానే ఒక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపామని, రామ్‌గఢ్ డిప్యూటీ కమిషనర్ (డిసి) ఫైజ్ అక్ అహ్మద్ ముంతాజ్ తెలిపారు. ఘటనా స్థలంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, ఒక మృతదేహాన్ని వెలికితీసినట్లు వెల్లడించారు. గనిలో చాలామంది చిక్కుకున్నారని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొందరు గ్రామస్తులు బొగ్గు అక్రమ తవ్వకాలలో పాల్గొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.
ఇది కూడా చదవండి: ‘ట్రంప్‌కు ప్రధాని మోదీ తలొగ్గుతారు?’.. రాహుల్ ఘాటు వ్యాఖ్యలు