
అల్లూరి సీతారామరాజు జిల్లా.: జిల్లాలోని వీఆర్‌పురం మండలం అన్నవరం వదద బ్రిడ్జి కూలిపోవడంతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. కొండవాగుల వరద పోటుకు బ్రిడ్జి కూలిపోయింది.
ఫలితంగా సుమారు 40 గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన నిర్మించి ఏడాడి తిరగకుండానే కూలిపోవడంతో అధికారులు, కాంట్రాక్టర్లపై స్థానికులు మండిపడుతున్నారు. నాణ్యతలేని వంతెన నిర్మించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.