
తిరువనంతపురం: కేరళలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మలయాళ నటి తాజాగా.. ఓ యువ రాజకీయ నాయకుడిపై వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. దీంతో, ఆరోపణలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. బాధితురాలు సదరు వ్యక్తి పేరు చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ నేతను టార్గెట్ చేసి బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
వివరాల ప్రకారం.. కేరళలో మలయాళ నటి రీనీ ఆన్ జార్జ్ తాజాగా సంaచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఆమె సోషల్ మీడియా పోస్టులో.. ‘కేరళకు చెందిన ఓ యువ రాజకీయ నాయకుడు తనను హోటల్‌కు రమ్ముంటున్నాడని అన్నారు. తనకు అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. గత మూడేళ్లుగా ఇలా జరుగుతోందన్నారు. అయితే, సదరు నేత వేధింపులకు సంబంధించి.. ఆ పార్టీలోని సీనియర్లకు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. అయినా కూడా ఆయనపై చర్యలు తీసుకోకుండా.. ఉన్నత పదవులు ఇస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు నేత.. తనను మాత్రమే కాదు.. ఇప్పటి చాలా మంది యువతులను ఇలా వేధించినట్టు తనకు తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, పోస్ట్‌లో మాత్రం ఆమె ఎక్కడా.. అతడి పేరును, రాజకీయ పార్టీని ప్రస్తావించలేదు. దీంతో, నటి ఆరోపణలపై కేరళలో రాజకీయ దుమారం చెలరేగింది.
Malayalam actor Rini Ann George accused Youth Congress state president and Palakkad MLA Rahul Mamkootathil of sending her offensive messages and of harassment. It has created a furore in Kerala politics! pic.twitter.com/puu1FRjOOP
— Sreedhar Pillai (@sri50) August 21, 2025
బీజేపీ మాత్రం ఆమె ఆరోపణలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ టార్గెట్ చేసింది. ఆయనే వేధింపులకు పాల్పడుతున్నారని కాషాయ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ పేరు ప్రస్తావిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ మార్చ్ నిర్వహించింది. కాగా, రాహుల్ మమ్‌కూటథిల్ ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు.
ఇదిలా ఉంటే రచయిత్రి హనీ భాస్కరన్ కూడా రాహుల్ మమ్‌కూటథిల్‌పై ఆరోపణలు చేశారు. తనను కూడా వేధింపులకు గురి చేశాడని తెలిపింది. సోషల్ మీడియాలో పదే పదే సందేశాలు పంపి వేధించాడని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. యూత్ కాంగ్రెస్‌లో మహిళలను కూడా ఇలానే వేధించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు కాంగ్రెస్ నేత వేధింపుల వ్యవహారం కేరళలో కొత్త చర్చకు దారి తీసింది.