
రాంచీ: జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్‌లో ఎక్కువ కాలంగా ఉపయోగించకుండా ఉన్న 50,000 మందికి పైగా రేషన్ కార్డుదారుల పేర్లను అధికారులు తొలగించారు. మొత్తం 1,64,237 మంది కార్డులు ఉపయోగలో లేవని, వెరిఫికేషన్ డ్రైవ్లో భాగంగా వాటిలో 50,323 మంది పేర్లను తొలగించినట్లు అధికారులు ప్రకటించారు.
మరో 1,13,338 మంది పేర్లను తనిఖీ చేస్తున్నట్లు తెలినపారు. ఆధార్ కార్డు నంబర్లు అనుమానాస్పదంగా ఉన్నందున జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 20,067 మంది తొలగించినట్లు ప్రకటనలో వెల్లడించారు. నిజమైన లబి్ధదారులకు మాత్రమే ఆహార ధాన్యాలు అందేలా చూడడమే ఈ వెరిఫికేషన్ లక్ష్యమని తెలిపారు.