
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, శరద్ పవార్, సంజయ్ రౌత్ తదితరులు పాల్గొన్నారు.
దీనికి ముందు ఆయన పార్లమెంటు ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ. ఆగస్టు 25లోపు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున జరగనుంది.
#WATCH | INDIA alliance Vice-Presidential nominee, former Supreme Court Judge B Sudershan Reddy pays tribute to freedom fighters and great leaders, ahead of filing nomination. pic.twitter.com/tH3Fjdx7KI
— ANI (@ANI) August 21, 2025