Liquor Policy Case: మనీష్‌ సిసోడియాకు ఊరట | Jailed Manish Sisodia Gets Permission To Meet UNwell wife once a Week | Sakshi
Sakshi News home page

Liquor Policy Case: మనీష్‌ సిసోడియాకు ఊరట

Feb 5 2024 4:21 PM | Updated on Feb 5 2024 4:28 PM

Jailed Manish Sisodia Gets Permission To Meet UNwell wife once a Week - Sakshi

న్యూఢిల్లీ:​  ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్‌ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు ఊరట లభించింది. మనీష్‌ సిసోడియా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తాజాగా మనీష్‌ సిసోడియా వరానికి ఒకసారి ఆనారోగ్యంతో ఉన్న తన భార్యను, వైద్యులను కలవడానికి ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. 

మనీష్‌ తన భార్యను వారానికోసారి కలిసేందుకు కస్టడీ పెరోల్‌కు అనుమతించాలని ఢిల్లీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.​ రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఫిబ్రవరి 2న మనీష్‌ దరఖాస్తుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)‌కి నోటీసు జారీ చేశారు.

అయితే మొదటి దరఖాస్తును సాధారణ బెయిల్‌గా.. రెండో దరఖాస్తును కస్టడీ పెరోల్‌పై మనీష్‌ వారానికి రెండు రోజులు తన భార్యను కలవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టు ఈడీకీ నోటీసు ఇచ్చింది. ఇక.. గత నవంబర్‌లో దీపావళీ సందర్భంగా తన భార్యను కలవటానికి మనీష్‌కు కోర్టు కస్టడీ పెరోల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం కేసులో మనీష్‌కు సంబంధాలు ఉన్న అభియోగాలపై ఈడీ, సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement