
సాక్షి,న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవీ కాలం మరో రెండేళ్ల ఉండగానే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు సోమవారం (జులై 21) ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.
ఇటీవల తలెత్తిన అనారోగ్యం కారణంగా భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నాట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన పదవీకాలంలో రాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంట్ సభ్యుల నుంచి పొందిన మద్దతుకు ధన్‌ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం సాధించిన ఆర్థిక పురోగతి, అభివృద్ధి,ప్రపంచ స్థాయిలో ఎదుగుదలను చూశానని అన్నారు.
కాగా, 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ ఛైర్మన్‌గా పార్లమెంటరీ వ్యవహారాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకు ప్రశంసలు పొందారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా (2019–2022) పనిచేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో తరచూ వివాదాలు చోటుచేసుకున్నాయి.
ఈ ఏడాది మార్చిలో గుండె సంబంధిత సమస్యల కారణంగా ఎయిమ్స్‌లో చేరారు. తాజాగా, ఆనారోగ్య సమస్యల కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (ఏ) కింద తన పదవికి రాజీనామా చేశారు.
