చంద్ర మండలంలో ఫ్లాట్‌.. సాధ్యమేనా?

Is It Possible to Buy Lunar Land - Sakshi

న్యూఢిల్లీ : రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి భార్య మీద ప్రేమతో చంద్రమండంలో మూడెకరాల భూమి కొని బహుమతిగా ఇచ్చాడనే వార్త చదివాం. అలానే కొన్ని నెలల క్రితం బోధ్‌గయా వాసి నీరజ్‌ కుమార్‌ తన పుట్టిన రోజు సందర్భంగా చంద్రుడి మీద ఎకరం స్థలం కొన్నానని ప్రకటించాడు. సామాన్యులే కాక దివంగత బాలీవుడ్‌ నటడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, షారుక్‌ ఖాన్‌ వంటి ప్రముఖ నటులు కూడా చంద్రుడి మీద ల్యాండ్‌ కొన్న వారి జాబితాలో ఉన్నారు. అయితే వాస్తవంగా చంద్రుడి మీద మనం స్థలం కొనడం సాధ్యమేనా అంటే కాదనే చెబుతున్నారు నిపుణులు. ఎందుకు కొనలేం వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవండి. 

విశ్వంలో భూమి తర్వాత మానువుల నివాసానికి అనుకూలమైన వేరే గ్రహం కోసం శాస్త్రవేత్తలు ఏళ్లుగా ప్రయోగాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి ఆశలు చంద్రుడి మీదనే ఉన్నాయి. సమీప భవిష్యత్తులో చందమామ మీద నివాసం ఉండే పరిస్థితులు ఏర్పడవచ్చు. అదే గనక సాధ్యమయితే చంద్రుడి మీద వలసవాద పోటీతత్వన్ని కట్టడి చేయడం కోసం పెద్ద దేశాలైన రష్యా, అమెరికా, యూకే 1967లో ఓ అంతర్జాతీయ ఒప్పందంతో ముందుకు వచ్చాయి. దీన్ని ఔటర్‌ స్పేస్‌ ట్రిటీ అంటారు. దీనిపై భారత్‌తో సహా 109 దేశాలు సంతకం చేశాయి. (చదవండి: భార్యకు చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్‌)

ఔటర్‌ స్పేస్‌ ట్రిటీ ఏం చెబుతోంది..
ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం చంద్రుడు, ఇతర ఖగోళ వస్తువుల మీద స్వీయ అన్వేషణ దోపిడి వల్ల సంబంవించే నష్టాన్ని నివారించడం. ఇక ఒప్పందంలోని రెండవ అర్టికల్‌ ప్రకారం చంద్రుడు, ఇతర ఖగోళవస్తువులతో సహా అంతరిక్షంలోని స్థలం.. ఏ దేశ సార్వభౌమాధికారం, ఉపయోగం, స్వాధీనం, ఇతర విధానాల ద్వారా జాతీయ స్వాధీనానికి లోబడి ఉండదు అని స్పష్టం చేస్తుంది. ఇక్కడ జాతీయ సమూపార్జన అంటే ఏ వ్యక్తి దానిని తన స్వంతం అని ప్రకటించుకోలేడని అర్థం. చంద్రుడితో పాటు ఇతర గ్రహాలు, బాహ్య అంతరిక్షంలో జరిపే అన్వేషణ, ఉపయోగం, ఫలితం అన్ని దేశాలకు సమానంగా వర్తిస్తుంది అని స్పష్టం చేసింది. అయితే ఈ ఒప్పందంలోని మరో ఆసక్తికర అంశం ఏంటంటే అంతరిక్ష పరిశోధనలో పాల్గొనే శాస్త్రవేత్తలని ఈ ఒప్పందం అంతరిక్షంలో మానవజాతి దూతలుగా వర్ణించింది. 

అయితే లూనార్‌ రిజిస్ట్రీ అనే ఓ సంస్థ మాత్రం చంద్రుడి మీద స్థలాన్ని విక్రయిస్తానని చెప్పుకుంటుంది. బే ఆఫ్‌ రెయిన్‌బోస్‌, సీ ఆఫ్‌ రెయిన్స్‌, ల్యాక్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌, సీ ఆఫ్‌ సర్టెనిటీ వంటి అనేక రకాల ఇతర పేర్లతో చంద్రుడి మీద స్థలాన్ని అమ్ముతుంది. ఇక ఎవరైనా తాము లూనార్‌ రిజిస్ట్రీ ద్వారా చంద్రుడి మీద స్థలం కొన్నామని చెబితే దానర్థం వారు లూనార్ సెటిల్మెంట్ ఇనిషియేటివ్‌కు అనుగుణంగా క్లెయిమ్ చేస్తున్నారని. దాని ప్రకాంర చంద్రమండలంలో స్థలం కొన్నాను అంటే ఆ మొత్తాన్ని "చంద్రుడు, దాని మీద వనరుల అన్వేషణ, పరిష్కారం, అభివృద్ధి వంటి కార్యక్రమాలకి ఆర్థిక సహాయం చేయడానికి" అందించినట్లు. లూనార్ సెటిల్మెంట్ ఇనిషియేటివ్ ప్రకారం, "చంద్రుడి మీద ఎకరం స్థలం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో 95 శాతం ఎస్క్రో ఖాతాలో జమ చేయబడుతుంది. అది స్వతంత్రంగా ఎన్నుకోబడిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చేత నియంత్రించబడుతుంది." (చదవండి: ఆ మట్టి ఖరీదు రూ.11 లక్షలు)

ఇక చివరగా చెప్పేది ఏంటంటే ఈ కొనుగోలు ద్వారా లభించే మొత్తం లూనా సొసైటీ ఇంటర్నేషనల్, దాని భాగస్వాములు, అనుబంధ సంస్థల ద్వారా "చంద్రుని మీద ప్రైవేటీకరించిన అన్వేషణ, పరిష్కారం, అభివృద్ధి" లక్ష్యం కోసం వినియోగిస్తారు తప్పితే అక్కడ మనం అనుకున్నట్లుగా సదరు వ్యక్తుల పేరు మీద ల్యాండ్‌ రిజస్టర్‌ చేయడం వంటివి ఏం ఉండవు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top