ఇస్రో చైర్మన్‌ ఆత్మకథ | ISRO Chairman S Somanath Pens His Own Autobiography To Release Soon - Sakshi
Sakshi News home page

L Somanath Autobiography: ఇస్రో చైర్మన్‌ ఆత్మకథ

Oct 26 2023 5:46 AM | Updated on Oct 26 2023 10:27 AM

ISRO Chairman S Somanath pens autobiography - Sakshi

తిరువనంతపురం: ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఆత్మకథ రాశారు. ‘నిలవు కుడిచ సింహగల్‌ (వెన్నెల గ్రోలిన సింహాలు)’ పేరిట మలయాళంలో రాసిన ఈ ఆత్మకథ త్వరలో రానుంది. యువతరానికి తన జీవితం స్ఫూర్తిగా నిలవాలనే ఈ ఆత్మకథ రాసినట్లు ఆయన వెల్లడించారు.

అత్యంత నిరుపేద గ్రామీణ కుటుంబంలో పుట్టిన ఆయన ఇస్రో చైర్మన్‌ స్థాయికి ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఎదురైన కష్టాలను ఆయన ఇందులో హృద్యంగా వివరించారు. చంద్రయాన్‌ మిషన్‌ విజయం తనను ఆత్మకథ రచనకు పురిగొల్పిందని చెప్పారాయన. ఇంజనీరింగ్‌ కాలేజీకి పాత డొక్కు సైకిల్‌ మీద వెళ్లిన వైనం తదితరాలను పుస్తకంలో పొందుపరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement