శ్రీహరికోట నుంచి ఇస్రో వందో ప్రయోగం సక్సెస్‌ | ISRO 100th Mission From Sriharikota, Launch Of GSLV-F15 With NVS-02 On Jan 28th, Check Tweets Inside | Sakshi
Sakshi News home page

శ్రీహరికోట నుంచి ఇస్రో వందో ప్రయోగం సక్సెస్‌

Jan 29 2025 6:32 AM | Updated on Jan 29 2025 10:28 AM

ISRO 100th mission from Sriharikota Jan 28th Live Updates

తిరుపతి, సాక్షి: భారత అంతరి ప్రయోగ సంస్థ ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం విజయవంతమైంది. సూళ్లురుపేట శ్రీహరికోట నుంచి బుధవారం వేకువఝామున జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-15 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. సుమారు 2,250 కిలోల బరువున్న ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని అది విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో శాస్త్రవేత్తలు సంబురాల్లో మునిగితేలారు.  

కొత్త రకం నేవిగేషన్‌ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌-02 రెండోది. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250కిలోలు. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్‌ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్‌ పరికరాల్లో లోకేషన్‌ ఆధారిత సేవలందించనుంది. పదేళ్లపాటు ఈ నేవీగేషన్‌ శాటిలైట్‌ తన సేవలందిస్తుందని ఇస్రో చైర్మన్‌ వీ నారాయణన్‌ తెలిపారు. 

ఇస్రో వందో ప్రయోగం సక్సెస్‌పై ఆయన ఇస్రో సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ‘‘ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్‌ అయ్యింది. నేవీగేషన్‌ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. ఇస్రో వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది’’ అని అన్నారు. కాగా, ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ నేతృత్వంలో జరిగిన తొలి ప్రయోగం ఇదే. 

కాగా, ఇస్రో శ్రీహరికోటలో రాకెట్‌ ప్రయోగ కేంద్రాన్ని స్థాపించిన తర్వాత ఇప్పటివరకు 99 ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో కేవలం పది ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి. ఈ వందో ప్రయోగం విజయవంతం కావడంతో.. మెరుగైన GPS తరహా నేవిగేషన్ సిస్టం అందుబాటులోకి రానుంది. భారత భూభాగంతో పాటు భారత భూభాగంలోని తీరం నుంచి దాదాపు 1,500 కిలోమీటర్ల వరకు ఈ నేవిగేషన్ సిస్టం పని చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement