భారతీయ ప్రముఖులపై చైనా నిఘా!

India Under China Watch, 1400 Companies Under Watch - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద ఉద్రిక్తతలు రోజురోజుకు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌పై గూఢచర్య కుట్రలకు చైనా పాల్పడుతున్నట్టు వెల్లడైంది. షెన్జెన్ ఆధారిత టెక్నాలజీ సంస్థ ‘జెన్‌హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కో లిమిటెడ్‌ సంస్థ’ చైనా ప్రభుత్వం, కమ్యూనిస్ట్‌ పార్టీతో సంబంధాలు కలిగి ఉంది. ఈ  సంస్థ భారతదేశంలోని 10,000 మందికి పైగా సంస్థలపై ఒక కన్నేసి వుంచిన్నట్లు తెలుస్తోంది.  'హైబ్రిడ్ వార్ఫేర్', 'చైనా దేశ గొప్ప పునరుజ్జీవనం' కోసం పెద్ద డేటాను ఉపయోగిస్తున్నట్లు తనని తాను అభివర్ణించుకుంది. 

1400 భారతీయ కంపెనీలు జెన్‌హువా డేటాబేస్‌లో ఉన్నాయి. ఈ సంస్థ ట్రాక్ చేస్తున్న వారిలో ప్రముఖ కంపెనీలు నైకా, ఉబెర్ ఇండియా, పేయు, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్గి సంస్థల అధినేతలు, వ్యవస్థాపకులు ఉన్నారు. భారతదేశంలో జరుగుతున్న అనేక చెల్లింపు, విద్య, డెలివరీ అనువర్తనాలు కూడా చైనా పర్యవేక్షణలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అనేక మంచి స్టార్టప్‌లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలు కూడా చైనా పరిశీలనలో ఉన్నట్టు వెల్లడైంది. డెలివరీ యాప్‌లు బిగ్‌బాస్కెట్, డైలీ బజార్, జాప్‌ఫ్రెష్, ఫ్రెష్ మీట్ మార్కెట్, జోమాటో, స్విగ్గి, ఫుడ్‌పాండా, ఆన్‌లైన్ మాంసం డెలివరీ ప్లాట్‌ఫాంలను కూడా చైనా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.  రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఇతర కేంద్రమంత్రులు, ప్రముఖ సంస్థల సీఈఓలు, సీఎఫ్‌ఓల కదలికలపై చైనా కంపెనీ కన్నేసినట్టు అర్థమవుతోంది.

చదవండి: నవంబర్‌ నాటికి చైనా వ్యాక్సిన్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top