
ఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాదిలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పండుగ వేళ నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో, వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు కాగా, కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఢిల్లీలో శనివారం పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 90 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో నాలుగు విమాన సర్వీసులను రద్దు చేసినట్టు తెలిపారు.
VIDEO | Rain lashes parts of Delhi. Visuals from Inderlok.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/i8mkNctG8X— Press Trust of India (@PTI_News) August 8, 2025
శుక్రవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఢిల్లీలోని అండర్ పాసుల్లోకి వర్షపు నీరు చేరుకుంది. పలు లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరుకుంది. ఇక, ఢిల్లీలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్, ఎల్లో అలర్ట్ విధించింది. అలాగే, హర్యానాకు ఆరెంజ్ అలర్ట్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.
Heavy rain & thunderstorm activitiy is expected in some parts of Western #UttarPradesh, #Delhi, #Haryana & NorthEastern parts of #Rajasthan during the next 2 days. pic.twitter.com/2KQm1lCcZ5
— ThunderWild Weather (@ThunderWildWx) August 8, 2025
रक्षाबंधन पर्व के पहले दिल्ली एनसीआर में जाम से बिगड़े हालात, गाजियाबाद में मेरठ एक्सप्रेस वे पर 15 किलोमीटर लंबा जाम, कई घंटों से जाम में फंसे हैं हजारों लोग, वेब सिटी के पास से ली गई तस्वीर।#delhi #NCR #gaziabad #meerut #Expressway #highway #दिल्ली #एनसीआर #गाजियाबाद #मेरठ pic.twitter.com/JeMsIfxL1P
— Anurag Singh Gaharwar (@AnuragSingh_in) August 9, 2025
#Delhi pic.twitter.com/WwSWLYFo5n
— Ayushi Agarwal (@ayu_agarwal94) August 9, 2025