ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై అమిత్‌ షా ట్వీట్‌ | Home Minister Amit Shah Tweet On Chhattisgarh Encounter, Says Success Towards Building Naxal Free Bharat | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై అమిత్‌ షా ట్వీట్‌

Jan 21 2025 12:23 PM | Updated on Jan 21 2025 1:38 PM

Home Minister Amit Shah Tweet On Chhattisgarh Encounter

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

సాక్షి, ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. నక్సలిజం చివరి దశలో ఉందన్న అమిత్‌.. మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. త్వరలోనే మనం మావోయిస్టులు లేని ఇండియాను చూస్తామంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మన భద్రతాదళాలు సాధించిన గొప్ప విజయంగా పేర్కొన్న అమిత్‌షా.. నక్సలిజానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అన్నారు. నక్సల్స్‌ లేని భారత్‌ దిశగా ఇది కీలక అడుగని.. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు.

ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎదురు కాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల కీలక నేతలు కూడా మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్‌ ఉన్నారు. గతంలో వారిపై ప్రభుత్వం కోటి రూపాయలు రివార్డ్‌ ప్రకటించింది. 

మావోయిజం చివరి దశలో ఉంది: అమిత్‌ షా

ఇదీ చదవండి: భారీ ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్‌ కీలక నేత చలపతి మృతి

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్‌, నౌపాడలో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజామున జరిపిన గాలింపులో మరో 14 మంది మృతదేహాలు లభ్యం కాగా, ఇవాళ మధ్యా‍హ్నానికి 19కి పెరిగింది. భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement