కొచ్చి యూనివర్సిటీ తొక్కిసలాటకు కారణమిదే..

Heavy Downpour Leads To Kochi University stampede - Sakshi

కొచ్చి: ఒక్కసారిగా కుంభవృష్టి కురవడం వల్లే కొచ్చి యూనివర్సిటీలో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు చనిపోయారు. 50 మంది దాకా గాయపడ్డారు.సింగర్‌ నిఖితాగాంధీ కన్సర్ట్‌ సందర్భంగా విద్యార్థులు ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియంలో గుమిగూడినపుడు ఘటన జరిగింది. 

‘ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియం లోపలికి వెళ్లేందుకు బయటికి వచ్చేందుకు ఒకే గేట్‌ ఉంది. పాసులు ఉన్న వాళ్లను ఆ ఒక్క గేటు నుంచే బ్యాచుల వారిగా లోపలికి నిర్వాహకులు లోపలికి పంపారు. లోపలికి వెళ్లేందుకు పాసులు లేని యూనివర్సిటీకి సంబంధం లేని యువకులు పెద్ద సంఖ్యలో గేటు వద్ద వేచి ఉన్నారు. ఈ సమయంలోనే వర్షం పడింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. అక్కడున్న మెట్ల మీది నుంచి కొందరు కిందపడ్డారు. పడిపోయిన వారి మీద నుంచి విద్యార్థులు పరుగులు తీయడంతో నలుగురు చనిపోయారు’ అని పోలీసులు తెలిపారు.  

మృతి చెందిన విద్యార్థులను అతుల్‌ తంబి, అన్‌ రుఫ్తా, సరా థామస్‌, అల్విన్‌గా గుర్తించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 30 మంది త్వరగా కోలుకుంటున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గాయపడ్డవారి చికిత్సను దగ్గరుండి పర్యవేక్షించాల్సిందిగా ఆరోగ్య మంత్రిని ఆదేశించారు.  

ఇదీచదవండి..నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది?
   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top