ఐదోసారి 1.30 లక్షల కోట్ల మార్క్‌ దాటిన జీఎస్టీ  | GST Collection In February 2022 Crosses Rs 1. 30 Lakh Crore | Sakshi
Sakshi News home page

ఐదోసారి 1.30 లక్షల కోట్ల మార్క్‌ దాటిన జీఎస్టీ 

Mar 2 2022 3:14 AM | Updated on Mar 2 2022 3:21 AM

GST Collection In February 2022 Crosses Rs 1. 30 Lakh Crore - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఐదోసారి జీఎస్టీ వసూళ్లు రూ.1.30 లక్షల కోట్ల మార్క్‌ దాటా యి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు 18% అధికంగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో రూ.1,33,026 కోట్ల స్థూల జీఎస్టీ ఆదాయం సేకరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఒమ్రికాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో కోవిడ్‌–19 ఆంక్షలు కొనసాగినప్పటికీ జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైంది.

మరోవైపు 2021 ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో 13% వృద్ధితో రాష్ట్రానికి రూ.4,113 కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరింది. 2020 ఫిబ్రవరి జీఎస్టీ రాబడి కంటే ఈ ఏడాది 26% అధికంగా వచ్చింది. గత నెల జీఎస్టీ స్థూల రాబడి రూ.1,33,026 కోట్లు కాగా ఇందులో సీజీఎస్టీ (కేంద్ర జీఎస్టీ) రూ.24,435 కోట్లు, ఎస్‌జీఎస్టీ (రాష్ట్ర జీఎస్టీ) రూ.30,779 కోట్లు,  వస్తువుల దిగుమతిపై చేసిన రూ.33,837 కోట్ల వసూళ్లతో కలిపి మొత్తం ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ) రూ.67,471 కోట్లు, సెస్‌ రూ. 10,340 కోట్లు ఉన్నాయి. గత నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం గతేడాది కంటే 38% ఎక్కువగా ఉన్నది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement