మహాత్ముని పలుకులే భారత్‌–అమెరికా మైత్రికి మూలం

G20 Summit: US President Joe Biden Pays Tribute To Mahatma Gandhi At Rajghat - Sakshi

రాజ్‌ఘాట్‌లో గాందీజీకి ఘన నివాళులరి్పంచిన అగ్రరాజ్యాదీశుడు

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీజీ ప్రబోధించిన సంరక్షణ సూక్తులే భారత్‌–అమెరికా మధ్య సత్సంబంధాలకు మూలమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మహాత్ముని సమాధి ‘రాజ్‌ఘాట్‌’లో నివాళులరి్పంచిన సందర్భంగా బైడెన్‌ పలు ట్వీట్లు చేశారు. ‘ గాం«దీజీ ప్రవచించిన సంరక్షణ సూక్తులే ఇరు దేశాల మధ్య దృఢ బంధానికి మూలం. మన రెండు దేశాలు మధ్య నెలకొన్న పరస్పర నమ్మకం, సంరక్షణ బాధ్యతలే మన పుడమి సంరక్షణకూ దోహదపడుతున్నాయి’ అని అన్నారు.

‘మోదీతో విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతంగా ముగిశాయి. 31 అధునాతన డ్రోన్ల కొనుగోలు, భారత్‌లో జీఈ జెట్‌ ఇంజిన్ల సంయుక్త తయారీసహా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి’ అని చెప్పారు. ‘ఈ రోజు ఇక్కడికి(రాజ్‌ఘాట్‌)కు తీసుకొచ్చిన మీకు(ప్రధాని మోదీ) నా కృతజ్ఞతలు. అద్భుతంగా అతిథ్యమిచి్చ, జీ20 సదస్సును సజావుగా నిర్వహించి, కూటమికి విజయవంతంగా సారథ్యం వహించారు. రాజ్‌ఘాట్‌కు రావడం నిజంగా గర్వంగా ఉంది. గాం«దీజీ ఆచరించి చూపిన సత్యం, అహింసా మార్గాలు ప్రపంచానికి ఆచరణీయాలు.

ఇవి ఎల్లప్పుడూ ప్రపంచదేశాలకు స్ఫూర్తిదాయకాలు. ఇదే మన రెండు దేశాల బంధానికి పునాది రాళ్లు’ అని మోదీనుద్దేశిస్తూ బైడెన్‌ ట్వీట్‌చేశారు. జీ20 సదస్సు ముగిశాక భారత్‌కు బైబై చెప్పిన బైడెన్‌.. వియత్నాంకు పయనమయ్యారు. మహాత్మునికి జీ20 నేతలంతా పుష్పగుచ్ఛాలతో నివాళులర్పిస్తున్న ఫొటోను, కార్యక్రమానికి సంబంధించిన 19 సెకన్ల వీడియోను బైడెన్‌ ట్వీట్‌ చేశారు. జీ20 దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు కూటమే స్వయంగా పరిష్కార మార్గాలు కనిపెట్టగలదని బైడెన్‌ ధీమా వ్యక్తంచేశారు.

మహాత్మునికి నేతల నివాళి
జీ20 సదస్సుకు విచ్చేసిన నేతలంతా ఆదివారం రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాం«దీకి నివాళులరి్పంచారు. మొదట వారంతా వర్షం నీరు నిలిచిన రాజ్‌ఘాట్‌ లోపలికొచ్చారు. 1917 నుంచి 1930 వరకు గాం«దీజీ నివసించిన సబర్మతి ఆశ్రమం ఫొటో ఉన్న ప్రాంతం వద్ద నిల్చుని విడివిడిగా ఒక్కో నేతకు మోదీ స్వాగతం పలికారు. ఫొటో చూపిస్తూ ఆశ్రమం ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ అంగవస్త్రం బహూకరించారు. మోదీ, సునాక్‌ పాదరక్షలు లేకుండా రాజ్‌ఘాట్‌ లోపలికి ప్రవేశించగా, మిగతా నేతలు.. నిర్వాహకులు సమకూర్చిన తెల్లని పాదరక్షలు ధరించారు. తర్వాత నేతలంతా కలిసి గాం«దీజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అక్కడి శాంతికుడ్యంపై సంతకాలు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top