
న్యూఢిల్లీ: దేశంలోని పలు పెట్రోల్ పంపుల్లో అవినీతి బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించిన ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇంధన డిస్పెన్సర్ ట్యాంపరింగ్‌కు సంబంధించన ఉదంతం చర్చనీయాంశంగా మారింది.
ఇంధన డిస్పెన్సర్ ట్యాంపరింగ్ అంటే ఏమిటి?
వాహన ట్యాంక్ సామర్థ్యం 70 లీటర్లు ఉన్నప్పుడు 77 లీటర్లు పోసినట్లు చూపించి, తరువాత 57 లీటర్లు మాత్రమే నిల్వ ఉంచినట్లు నిర్ధారిస్తారు. దీనిపై వినియోగదారులు ప్రశ్నిస్తే పంపు సిబ్బంది.. వాహనం ఇంధన సామర్థ్యం 70 లీటర్లు అనేది ఒక ప్రామాణిక సంఖ్య అని, వాస్తవ ట్యాంక్ పరిమాణం 57 లీటర్లు అని చెబుతారు. తాము పంపిణీ చేసిన అదనపు 13 లీటర్లు వాహనంలోని దాచిన రిజర్వ్ లేదా వ్యవస్థలోని వేరే భాగానికి వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతూ, మోసాలకు పాల్పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు.
The vehicle owner asked to fill the car tank.
Capacity was 70 litres but 77 litres poured.
Upon investigation it was 57 litres only.
भारत एक ठगों का देश है। ऐसे नहीं पढ़े लिखे, अमीर, cricketrs, actors, singers, businessman, engineers, entrepreneurs देश से भाग रहे हैं। pic.twitter.com/nB8BgFRqKK— The Exploited TaxPayer (@IndiaNewGen) September 26, 2025
మోసం ఎలా జరుగుతుంది?
నిపుణులు ఈ తరహా మోసం ఎలా జరుగుతుందనే విషయాన్ని తెలియజేశారు. డిస్పెన్సర్ యంత్రంలోని పల్సర్ (Pulser) యూనిట్‌లో మైక్రోచిప్ అమర్చి ఉండవచ్చు. ఈ చిప్ రీడింగ్‌ను వేగంగా పెంచుతుంది. కానీ నిజమైన ఇంధన ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకు ఒక లీటరు ఇంధనం కొడితే, మీటర్ 1.1 లీటర్ లేదా 1.2 లీటర్ చూపించేలా చేస్తుంది. దీనివల్ల, ట్యాంక్‌లో ఇంధనం నిండుతున్నప్పుడు కూడా (70 లీటర్ల వద్ద నిండిపోయినా), మీటర్ ఆగిపోయే వరకు (77 లీటర్లు చూపించే వరకు) కౌంటింగ్ కొనసాగుతుంది. వినియోదారుని వాహన ట్యాంక్ నిండిపోయిన తర్వాత కూడా, మీటర్‌లో అధిక రీడింగ్ (77 లీటర్లు) చూపడం ద్వారా, ఆ అధిక మొత్తానికి (7 లీటర్లకు) డబ్బు వసూలు చేస్తారు.
ఇలా గ్రహించాలి
ఇంధనం నింపడం ప్రారంభించినప్పుడు మీటర్ ‘0’ వద్ద కాకుండా, పాత రీడింగ్ నుంచి లేదా తప్పుడు ‘జంప్ స్టార్ట్’ రీడింగ్‌తో మొదలవడం. దీనివల్ల మొత్తం లీటర్ల సంఖ్య పెరిగి కనిపిస్తుంది. పంప్ ద్వారా 77 లీటర్లు పంపిణీ అయినట్లు చూపించినప్పటికీ, వాస్తవానికి ట్యాంక్‌లో 57 లీటర్లు మాత్రమే నిల్వ అయినట్లు నిర్ధారితమైతే, దీని వెనుక ఉన్న ట్యాంపరింగ్ ఉందని వాహనదారుడు గ్రహించాలి. ఇది లీగల్ మెట్రాలజీ (Legal Metrology) నిబంధనలకు విరుద్ధమని గుర్తించాలి.
పంప్‌లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ దాడులు
ఈ తరహా మోసాల కారణంగా ప్రతి వాహనదారుడు ఇంధనం నింపేటప్పుడు కొద్ది మొత్తంలో నష్టపోతున్నప్పటికీ, పంప్ యజమానులకు ఇది భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వాహనదారులు ఇటువంటి మోసాలకు గురవుతుండడంతో, ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ తరహా మోసాలను అరికట్టేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని పంపుల యజమానులు నెలకు కోట్లలో అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు తేలింది. వివిధ రాష్ట్రాలలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు పెట్రల్ పంపులపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నాయి. ట్యాంపరింగ్ చేసే యంత్రాలను సీజ్ చేసి, సంబంధిత డీలర్లపై లీగల్ మెట్రాలజీ చట్టం (Legal Metrology Act) కింద కేసులు నమోదు చేస్తున్నాయి.