మటన్‌ పులుసులో కప్ప | Frog Mutton soup In Tamil Nadu | Sakshi
Sakshi News home page

మటన్‌ పులుసులో కప్ప

May 7 2025 9:01 AM | Updated on May 7 2025 9:01 AM

Frog Mutton soup In Tamil Nadu

రెస్టారెంట్‌ను సీజ్‌  చేసిన అధికారులు

అన్నానగర్‌(తమిళనాడు): పూందమల్లి మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో నావలడి అనే ప్రైవేట్‌ హోటల్‌ నడుస్తోంది. ఆదివారం రాత్రి ఈ రెస్టారెంట్‌కి ఓ కుటుంబం భోజనం చేసేందుకు వెళ్లింది. అక్కడ బిర్యానీ, మటన్‌ గ్రేవీ ఆర్డర్‌ చేసి తింటున్నారు. సిబ్బంది తీసుకొచ్చిన మటన్‌ పులుసును వారు తినేందుకు ప్రయత్నించగా అందులో పెద్ద కప్ప చనిపోయిందని తెలుస్తుంది. దీంతో షాక్‌ తిన్న వారు హోటల్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఈ సందర్భంగా వారు ఆహారంలో కప్ప మొత్తం పడి ఉన్న వీడియోను తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి సంచలనం సష్టించింది. దీనిపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు సమాచారం అందింది. ఆ తర్వాత తిరువళ్లూరు జిల్లా ఆహార భద్రత విభాగం అధికారి వేలవన్‌ నేతృత్వంలో అధికారులు ఘటన జరిగిన హోటల్‌కు వెళ్లి కిచెన్‌లో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత హోటల్‌కు సీల్‌ వేసి చర్యలు తీసుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement