
ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలోని ఓ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లాజిక్స్ మాల్‌లోని ఓ బట్టల దుకాణంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. దీంతో ఉద్యోగులు, షాప్ నిర్వాహకులు, జనాలు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.
సమాసచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది... వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆర్పడం ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా మాల్‌లోని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మాల్ బయట పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. అయితే మాల్ లోపల పొగలు కమ్ముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
VIDEO | Fire breaks out at Logix Mall, Wave City Centre, #Noida. Several fire tenders at the spot. More details are awaited
(Source: Third Party) pic.twitter.com/9gQR1wmIuV— Press Trust of India (@PTI_News) July 5, 2024