జయా బచ్చన్‌కు మళ్లీ కోపమొచ్చింది...సెల్ఫీ తీసుకోబోతే | Jaya Bachchan loses cool at man trying to take selfie with her video viral | Sakshi
Sakshi News home page

జయా బచ్చన్‌కు మళ్లీ కోపమొచ్చింది...సెల్ఫీ తీసుకోబోతే

Aug 12 2025 5:44 PM | Updated on Aug 12 2025 6:01 PM

Jaya Bachchan loses cool at man trying to take selfie with her video viral

ప్రముఖ నటి,సమాజ్‌వాది పార్టీ  నాయకురాలు, రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్‌ (Jaya Bachchan) మరోసారి  వార్తల్లోనిలిచారు.  ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిపై జయాబచ్చన్‌ అసహనంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో  ఇంటర్‌నెట్‌లో  వైరలవుతోంది.  

తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని సీరియస్‌గా పక్కకు తోసేశారు జయా బచ్చన్‌. అంతేకాదు ‘ఏం చేస్తున్నావు ..ఏంటిది ?’ అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.  దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా హతాశులయ్యారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. చిన్న విషయాలకే సహనం కోల్పోతున్న జయాబచ్చన్‌ తీరుపై నెటిజన్‌లు విస్తుపోతున్నారు.  ఇంత యాటిట్యూడ్‌ పనికిరాదంటూ విమర్శిస్తున్నారు.

కాగా సీనియర్‌ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన భార్య  అయిన జయా పబ్లిక్‌ ప్రదేశాల్లో ఉన్నప్పుడు జయాబచ్చన్‌ దురుసు తనం, సహనం కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ఆపరేషన్‌ సింధూర్‌పై పార్లమెంట్‌లో, ఆపరేషన్ సిందూర్ పేరును ప్రశ్నించి, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చాలా మంది మహిళల "సిందూర్‌ను నాశనం" చేసినప్పుడు దానికి ఆ పేరు ఎందుకు పెట్టారని బచ్చన్ ఇటీవల ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది.

 

అధికార పార్టీ ఎంపీలు తన ప్రసంగానికి అంతరాయం కలిగించినప్పుడు  జయ అసహనానికి గురయ్యారు. మీరే..నేనో ఒక్కరే మాట్లాడాలి. మీరు మాట్లాడేటప్పుడు, నేను అంతరాయం కలిగించలేదు. ఒక మహిళ మాట్లాడేటప్పుడు, నేనైతే అంతరాయం కలిగించను. కాబట్టి నోరు అదుపులోపెట్టుకోండి అన్నట్టు మండిపడ్డారు. ఏప్రిల్‌లో ముంబైలో జరిగిన  దివంగత మనోజ్ కుమార్‌  నివాళి అర్పించే కార్యక్రమంలో జయా బచ్చన్ ఒక  మహిళతో చాలా రూడ్‌గా ప్రవర్తించిన వీడియో వైరల్ అయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement