Uttar Pradesh: భవనంలో అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు | Noida news fire in building in sector 18 | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: భవనంలో అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Apr 1 2025 1:18 PM | Updated on Apr 1 2025 1:35 PM

Noida news fire in building in sector 18

నోయిడా: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అగ్ని ప్రమాదాలు(Fire hazards) చోటుచేసుకుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గల సెక్టార్ 18లోని ఒక భవనంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్ని కీలల నుంచి తప్పించుకునేందుకు కొందరు భవనంపై నుంచి దూకడాన్ని మనం వీడియోలో చూడవచ్చు
 

మీడియాకు అందిన వివరాల ‍ప్రకారం అట్టా మార్కెట్‌(Atta Market)లోని ఒక వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల నుంచి తప్పించుకునేందుకు  భవనంలోని వారు తొలుత భవనం పైభాగానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సెక్టార్ 18లోని కృష్ణ అపరా ప్లాజాలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  కాగా ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నదీ ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. తొలుత భవనం బేస్మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి అగ్ని జ్వాలలు మొదటి అంతస్తుకు, తరువాత రెండవ అంతస్తుకు చేరుకున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rajasthan: లీకయిన విషవాయువు.. ఒకరు మృతి.. 40 మందికి అస్వస్థత

 

Advertisement
 
Advertisement
Advertisement