అన్నదాతల ఆందోళన..  ఫర్నీచర్‌ ధ్వంసం

Farmers Hold Protest For Fertilizer In Odisha At Rayagada - Sakshi

ఎరువుల కోసం కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

ఝోరిగాంలో యూరియా గౌడ్‌న్‌లో ఫర్నీచర్‌ ధ్వంసం

పోలీసుల రంగప్రవేశంతో శాంతించిన అన్నదాతలు 

రాయగడ: ఒడిశాలోని రాయగడ జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. అయితే సకాలంలో డిమాండ్‌కు సరిపడా ఎరువులను రైతులకు సరఫరా చేయడంలో యంత్రాంగం విఫలమైంది. దీంతో ఎరువుల కోసం నవరంగపూర్, రాయగడ జిల్లాల రైతులు హాహాకారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. రాయగడ జిల్లా కొలనార సమితిలోని బొడిఖిల్లాపొదోరొ, తెరువలి, ఖెదాపడ, డుమురిగుడ, కార్తీకగుడ, కిల్లగుడ, గడ్డి శెశిఖల్, దొందులి పంచాయతీలకు చెందిన రైతులు కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.

చదవండి: మైనర్‌ బాలిక కిడ్నాప్‌.. నోటిలో గుడ్డలు కుక్కి ..

వ్యవసాయం పనులు ప్రారంభించామని, సకాలంలో రావాల్సిన ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మరో వారంలో అందకపోతే పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించాలని కోరుతూ కలెక్టర్‌ సరోజ్‌కుమార్‌ మిశ్రాకు వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేకపోవంతో ఏడీఎంఓ సోమనాథ్‌ ప్రధాన్‌కు దాఖలు చేశౠరు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారి దుస్సాసన్‌ ప్రహరాజ్‌ను రైతులంతా చుట్టుముట్టారు. దీనిపై స్పందించిన ఆయన... ఎరువుల కొరత ఉన్న ప్రాంతాలకు వారం రోజుల్లో సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

ఎరువుల కోసం ఏకరవు.. 
జయపురం: నవరంగపూర్‌ జిల్లా ఝోరిగాం గొడౌన్‌కు యూరియా చేరిందని తెలియగానే వందలాది మంది రైతులు పోటెత్తారు. సుమారు 2వేల మంది అక్కడికి చేరుకోగా.. ప్రతి ఒక్కరికీ రెండు బస్తాల చెప్పున ఎరువులు అందించాలని డిమాండ్‌ చేశారు. అయితే కేవలం 1600 బస్తాలు మాత్రం అందుబాటులో ఉండటంతో అధికారులు చేతులెత్తేశారు. దీంతో భగ్గుమన్న రైతులు.. గోదాంను చుట్టుముట్టారు. కార్యలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఉమ్మరకోట్‌ ఎస్‌డీపీఓ దినేష్‌ చంద్రానాయక్, ఎస్‌ఐ నట్వర నందొ, ఝోరిగాం సమితి వ్యవసాయశాఖ అధికారి సునీత సింగ్, తహసీల్దార్‌ హృషికేష్‌ గోండ్‌ ఘటనా స్థలానికి చేరుకొని, రైతులకు నచ్చచెప్పారు. చివరకు ఒక్కో బస్తా చెప్పున అందించడంతో వారంతా శాంతించారు.

చదవండి: స్థానిక ఎన్నికలు.. తేలని పంచాయితీ!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top