స్థానిక ఎన్నికలు.. తేలని పంచాయితీ!

Odisha Govt Is Delaying Panchayat Elections But Opposition Demanding For Elections - Sakshi

సమితి స్థాయిలో ఓట్ల లెక్కింపునకు ప్రభుత్వం యోచన

పంచాయతీ ఎన్నికల నిబంధనలు–1965లో సంస్కరణలు

ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్న విపక్షాలు  

భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికల కాలపరిమితి ముగిసి, నేటికి మూడేళ్లు పూర్తయింది. అయినా ఎన్నికల నిర్వహణకు సర్కారు ఏమాత్రం ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించి, తీరాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడం..ఈ క్రమంలో ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుండడం నుంచి ఈ ‘పంచాయితీ’ నడుస్తోంది. అయితే కొన్నిరోజుల క్రితం ఓబీసీల ఓటు బ్యాంకు సమకూర్చుకునేందుకు ఎన్నికల్లో వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అధికార బీజేడీ ప్రకటన జారీ చేసింది.

చదవండి: వైరల్‌ వీడియో: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం..!

ఇప్పుడు మళ్లీ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలు జరిగిన రోజునే ఫలితాలు ఇవ్వకుండా ఫలితాల కోసం ఓ ప్రత్యేక రోజుని కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే ఇదివరకు ఏ పంచాయతీలో జరిగే ఎన్నికల ఫలితాలు.. ఎన్నికలు జరిగిన రోజునే ప్రకటించేవారు. ఇప్పుడు అలా కాకుండా సమితిలోని మొత్తం పంచాయతీల బ్యాలెట్‌ బాక్సులను సమితి కేంద్రానికి తరలించి, లెక్కించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ రెండు మార్పుల పట్ల ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మండిపడుతున్నాయి. ఇదంతా ఓట్లను తారుమారు చేసి, గెలిచేందుకే నవీన్‌ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేస్తోందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేలకు పైబడి పంచాయతీలు ఉండగా, 314 సమితులు ఉన్నాయి.

15 రోజుల్లో అభ్యంతరాలు.. 
పంచాయతీ ఎన్నికల్లో ఇదివరకున్న బూత్‌ స్థాయి ఓట్ల లెక్కింపునకు తెరపడుతుంది. సమితి ప్రధాన కార్యాలయంలో కేంద్రీకృత విధానంలో ఈసారి ఓట్లను లెక్కిస్తారు. సమితి వ్యాప్తంగా అంచెలంచెలుగా పోలింగ్‌ పూర్తయిన తర్వాత అన్ని బూత్‌లలో పోలైన ఓట్లను ఒకేసారి లెక్కపెడతారు. ఈ నేపథ్యంలో ఒడిశా గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు–1965 సంస్కరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు జారీ చేసింది. వీటి పట్ల సలహాలు, సూచనలు, అభ్యంతరాలను 15 రోజుల్లోగా దాఖలు చేయాలని అభ్యర్థించింది. ఈ ప్రక్రియ తర్వాత ఒడిశా గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు–2021 అమలు చేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

చదవండి: ఓరి భగవంతుడా .. కష్టాలు గట్టెక్కాయని అనుకునేలోపే..

   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top