సైఫ్‌పై దాడి చేసింది అతడే..! గుర్తించిన అత్యాధునిక టెక్నాలజీ | Break Through In Saif Ali Khan Case, Facial Recognition Of Bangladeshi Accused Matches With CCTV Person Face | Sakshi
Sakshi News home page

‘సైఫ్‌’పై దాడి చేసింది అతడే..! గుర్తించిన అత్యాధునిక టెక్నాలజీ

Jan 31 2025 4:17 PM | Updated on Jan 31 2025 5:31 PM

Facial Recognition Break Through In Saifalikhans Case

ముంబయి:బాలీవుడ్‌ నటుడు సైఫ్‌అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు.ఫేషియల్ రికగ్నైజేషన్‌ టెక్నాలజీని ఉపయోగించి సైఫ్‌ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించారు. 

దాడి జరిగిన రోజు సైఫ్‌ ఇంట్లో సీసీకెమెరాల్లో రికార్డయిన దృశ్యాల్లో ఉన్నది నిందితుడు మహమ్మద్‌ షరీఫుల్‌ ఇస్లామేనని ఫేషియల్‌ రికగ్నిషన్‌  ద్వారా నిర్ధారించినట్లు వెల్లడించారు. దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్‌ ప్రింట్స్‌ నిందితుడితో సరిపోలడం లేదన్న ప్రచారం నేపథ్యంలో ఫేషియల్‌ రికగ్నిషన్‌ నిర్ధారణ కీలకంగా మారింది. 

కాగా,జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు నిందితుడు ముంబయి బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి  దాడి చేశాడు. దాడి అనంతరం నటుడి ఇంటిని పరిశీలించిన పోలీసుల బృందం అక్కడి నుంచి సుమారు 19 వేలిముద్రలను సేకరించింది. 

ఈ ఫింగర్‌ ప్రింట్స్‌లో ఏవీ నిందితుడు ఇస్లాం ఫింగర్‌ ప్రింట్స్‌తో సరిపోవడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్‌ బృందం నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరిగడంతో దర్యాప్తుకు బ్రేక్‌ పడింది. నిజానికి సైఫ్‌ ఇంట్లోకి నిందితుడు ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని ఈ క్రమంలో అడ్డుకున్న సైఫ్‌తో తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement