తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ షురూ.. సీఈసీ కీలక ఆదేశాలు

Election Process Starts in Five States Along With Telangana - Sakshi

ఢిల్లీ:తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను సీఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీస్‌ అధికారులను బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రాల్లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు వాళ్ల సొంత జిల్లాలో పోస్టింగ్‌ ఇవ్వొద్దని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. జులై 31 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.స్థానికంగా అధికారులకు బంధుత్వాలు లేవని డిక్లరేషన్‌ తీసుకోవాలని తెలిపింది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఇదీ చదవండి:రెజ్లర్ల నిరసనపై నోరు విప్పిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top