కశ్మీర్లో ‘సరైన సమయం’లో ఎన్నికలు: ఈసీ

Election Commission to decide on Jammu Kashmir elections based on security situation - Sakshi

న్యూఢిల్లీ:  జమ్మూకశ్మీర్లో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని సరైన సమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషన్‌(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ సోమవారం చెప్పారు. ఏది సరైన సమయం అని తాము భావిస్తామో అప్పుడే అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికలు జరుగుతాయని అన్నారు.

ఆరి్టకల్‌ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడ ఎన్నికలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top