గత కొన్ని నెలలుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహల్ గాంధీ తరుచు విమర్శలు చేస్తూనే వస్తున్నారు. దేశంలో పలు అసెంబ్లీలకు ఎన్నికల జరిగిన నేపథ్యంలో ఈసీపై తన అస్త్రాలు సంధిస్తూనే వచ్చారు రాహుల్. ఓట్ చోరీకి పాల్పుడుతున్నారని, ఒక ఇంట్లో ఫేక్ ఓటర్లను నమోదు చేశారని, డూప్లికేట్ ఓటర్లు చాలా మందే ఉన్నారని ఇలా ఘాటు విమర్శలు చేస్తూనే ఉన్నారు.
బీజేపీకి ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని సైతం ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ పనిచేస్తోందని, ‘ఎన్నికల చోర్ బ్రాండ్’గా మారిందని వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికల సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారని ఆరోపించారు. నిజమైన ఓట్లను తొలగించి, డుప్లికేట్ ఓట్లు చేర్చుతున్నారని అన్నారు.
వీటిని తీవ్రంగా ఖండించింది ఎలక్షన్ కమిషన్. అయతే తాజాగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలిని ఖండించారు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎస్.వై. ఖురేషి. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాహుల చేస్తున్న విమర్శలపై ప్రస్తుత కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహారశైలి సరైనది కాదన్నారు. రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను తీవ్రమైనవిగా భావించి దర్యాప్తు చేపట్టాల్సిందిపోయి ఆయనపై ప్రత్యారోపణల బురద చల్లడం ఏమాత్రం సబబుకాదని పేర్కొన్నారు.
ఖురేషి పాడ్‌కాస్ట్‌లోని కీలకాంశాలు
రాహుల్ గాంధీ “ఓటు చోరి” (ఓటు దొంగతనం) అనే బహిరంగ ఆరోపణకు ఖురేషీ స్పందిస్తూ, కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా తాను చాలా సంవత్సరాలు పనిచేసినందున ఇది వ్యక్తిగత అవమానంగా అనిపిస్తుందని అన్నారు. ఇది తన ముఖంపై చెంప దెబ్బ కొట్టినట్లు అనిపించిందన్నారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలపై అడిగిన ప్రశ్నకు ఖురేషి స్పందిస్తూ..నకిలీ పేర్లు, నకిలీ ఓటర్లు మరియు ఇంటి నంబర్ యొక్క వివాదాస్పద వినియోగాలు వంటి తీవ్రమైన ఆరోపణలనేవి పారదర్శకత, జవాబుదారీతనాన్ని దెబ్బతీస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం పట్ల ఈసీ పక్షపాతంగా ఉందనే వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఇది పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజాస్వాఘ్య విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆ తరహా ఆరోపణలను క్షుణ్ణంగా పరిశోధించాల్సిన అవసరం ఈసీపై ఉందని నొక్కి చెప్పారు ఖురేషి.
ఈవీఎం హ్యాకింగ్స్-ఎలక్టోరల్ బాండ్లపై అడిగిన ప్రశ్నకు ఖురేషి బదులిస్తూ.. హ్యాకింగ్ భయాలు తరుచు అతిశయోక్తిగా మారినప్పటికీ, ఎన్నికల బాండ్ల అంశానికి సంబంధించి పారదర్శకత లేకపోవడం అనేది నిష్పాక్షిక ఎన్నికలకు పెద్దు ముప్పుగా అభివర్ణించారు.
ప్రస్తుత ఈసీకి ఖురేషి బహిరంగ సవాలు.. ఎన్నికల కమిషన్‌పై తరుచు వినిపిస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రజా సందేహలు పెరుగుతున్న దృష్టా .. వీటిని ఈసీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని బహిరంగ సవాల్ విసిరారు ఖురేషి.


