
సాక్షి, అమరావతి: ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్‌గా ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి నియమించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో మిథున్‌రెడ్డిని అరెస్టు చేయడంతో ఆయన బాధ్యతలను సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావులకు అప్పగించారు. ఇప్పుడు మిథున్‌రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో ఆయా జిల్లాల బాధ్యతలు తిరిగి అప్పగించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 49 మంది సభ్యులతో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ)ను, మరో 114 మంది సభ్యులతో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్‌ఈసీ)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది.