ఢిల్లీలో భూ ప్రకంపనలు | Earthquakes in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భూ ప్రకంపనలు

Jan 12 2024 6:29 AM | Updated on Jan 12 2024 6:29 AM

Earthquakes in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గురువారం మధ్యాహ్నం రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం పాకిస్తాన్‌–అఫ్గానిస్తాన్‌ సరిహద్దుల్లోని హిందూకుష్‌ ప్రాంతంలో ఉంది.

దీంతో దేశరాజధానితో పాటు పంజాబ్, చండీగఢ్, జమ్మూకశ్మీర్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కొద్దిసేపు భూమి కంపించింది. పాక్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్‌ ఫఖ్తుఖ్వా సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement