యూపీలో హల్‌చల్ చేసిన ఓ వ్యక్తి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మద్యం తాగిన ఓ వ్యక్తి హల్‌చల్ సృష్టించాడో వ్యక్తి. మద్యం మత్తులో ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కేశాడు. అంతటితో ఊరుకోలేదు. హైవోల్టు తీగల మీద పడుకుని ఊయలూగాడు. రాష్ట్రంలోని మహరాజ్‌గంజ్ జిల్లాలోని పర్సా ఖుర్ద్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రామంలోని దీన్‌దయాల్ అనే వ్యక్తి పీకలదాకా తాగాడు. మద్యం మత్తులో స్థానికంగా ఉన్న ఓ విద్యుత్ స్తంభం ఎక్కాడు.
చుట్టుపక్కల వాళ్లు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరు ఎంత వారించినా వినకుండా స్తంభం ఎక్కడమే కాదు.. 11వేల ఓల్టుల విద్యుత్ సరఫరా చేసే హైటెన్షన్ తీగలపై పడుకున్నాడు. ఓవైపు తల, మరో వైపు కాళ్లు పెట్టి వేలాడుతూ ఊయలూలాగాడు. ఎంత మంది చెప్పినా..కిందకు దిగడానికి నిరాకరించాడు. తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే భితౌలి పోలీసులు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించి విద్యుత్ సరఫరా నిలిపేసేలా చూశారు.
ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి అతడిని స్తంభం నుంచి దించేందుకు ప్రయత్నించారు. చివరికి వారి ప్రయత్నాలు ఫలించాయి. అతను స్తంభం నుంచి సురక్షితంగా దిగాడు. కొన్ని గంటలపాటు నెలకొన్న ఉత్కంఠకు తెరపడి.. అక్కడ గుమిగూడిన జనం ఊపిరి పీల్చుకున్నారు. సహాయక చర్యలకు తోడు ఆయనకు అదృష్టం కూడా కలిసొచ్చింది. దీన్ దయాళ్ స్తంభం ఎక్కడానికి కొన్ని నిమిషాల ముందే ఆ లైన్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ తరువాత పోలీసులు, విద్యుత్ శాఖ వేగవంతమైన సమన్వయంతో పెద్ద ప్రమాదం తప్పింది.


