పాక్‌ యువతి ట్రాప్‌లో డీఆర్‌డీఓ సైంటిస్ట్.. కీలక రహస్యాల చేరవేత..

DRDO Scientist Attracted To Pak Spy Agent Revealed Missile Secrets - Sakshi

పుణె: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న డీఆర్‌డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాక్‌ ఏజెంట్‌కు రక్షణ రంగ రహస్యాలను లీక్‌ చేశాడని దర్యాప్తులో తేలింది. అలియాస్ జరా దాస్‌గుప్తాగా పరిచయమైన పాకిస్థాన్ యువతి కురుల్కర్‌తో వాట్సాప్‌ చాట్‌ ద్వారా మిస్సైల్ సిస్టమ్‌లోని నిగూఢమైన రహస్యాలను రాబట్టింది. డీఆర్‌డీఓలో ఓ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్న కురుల్కర్‌ని మే 3న ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కస్టడిలో ఉన్నారు. 

ప్రదీప్‌ కురుల్కర్‌కు పాక్‌ యువతి జరా దాస్‌గుప్తాగా పరిచయమైంది. యూకేలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పి ప్రదీప్‌కు దగ్గరైంది. అనంతరం వాట్సాప్ చాట్‌, కాల్స్, అశ్లీల వీడియోలతో పాక్‌ యువతి ప్రదీప్‌ కురుల్కర్‌ను లోబరుచుకుంది. దర్యాప్తులో జరా దాస్‌ ఐడీ పాకిస్థాన్‌గా గురించినట్లు అధికారులు తెలిపారు. 

బ్రహ్మోస్ క్షిపణి, డ్రోన్, యూసీవీ, అగ్ని క్షిపణి లాంఛర్‌తో పాటు మిలిటరీ బ్రిగేడ్ సిస్టమ్‌కు సంబంధించిన అనేక రహస్యాలను ప్రదీప్ కురుల్కర్ జరా దాస్‌గుప్తాకు షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరివురూ 2022 జూన్‌ నుంచి 2022 డిసెంబర్‌ వరకు టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ అధికారులు కురుల్కర్‌పై అనుమానంతో దర్యాప్తు చేపట్టగా.. 2022 ఫిబ్రవరిలో ఆమె నెంబర్‌ను ఫోన్‌ నుంచి డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి రాగా.. అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.      

ఇదీ చదవండి: Violence On Elections Voting: బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి..

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top