ఆర్‌ఎంపీలకు కొత్త నిబంధనలు

Doctors can now refuse treatment to abusive, violent patients - Sakshi

న్యూఢిల్లీ: రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ (ఆర్‌ఎంపీ) వైద్యులకి జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కొత్త నియంత్రణలు విధించింది. ఫార్మా కంపెనీలు, వారి ప్రతినిధులు, వైద్య పరికరాల సంస్థల దగ్గర్నుంచి వైద్యులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కానుకలు, డబ్బులు, ఆతిథ్యం స్వీకరించకూడదని నిబంధనలు విధించింది.

ఫార్మా కంపెనీలు ఇచ్చే పార్టీల్లో పాల్గొనడం, ప్రయాణ సదుపాయాలను తీసుకోవడం వంటివి చేయకూడదని పేర్కొంది. రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్లు వృత్తిపరమైన బాధ్యతని కలిగి ఉంటూ ప్రవర్తించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 2నే ఈ నిబంధనల్ని జారీ చేసింది. అంతే కాదు ఫార్మా కంపెనీలు తయారు చేసే మందులు ఇతర పరికరాల వినియోగాన్ని ఆమోదిస్తూ ప్రకటనలివ్వకూడదంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top