తలకిందులైన విమానం..15 మందికి గాయాలు | Delta Airlines Flight Crash Land In Toronto | Sakshi
Sakshi News home page

కెనడాలో తలకిందులైన విమానం..15 మందికి గాయాలు

Feb 18 2025 7:18 AM | Updated on Feb 18 2025 8:37 AM

Delta Airlines Flight Crash Land In Toronto

టొరంటో: కెనడాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సోమవారం(ఫిబ్రవరి 17) టొరంటోలోని పియర్సన్‌ ఎయిర్‌పోర్ట్‌లో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం క్రాష్‌ లాండ్‌ అయింది. బలమైన గాలుల కారణంగా విమానం ల్యాండింగ్‌లో సమస్యలు తలెత్తి ఏకంగా తలకిందులైంది. ఈ ప్రమాదంలో 15 మంది దాకా గాయపడ్డారు. 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్‌ అంబులెన్స్‌లో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినపుడు విమానంలో 80 మంది ఉన్నారు. మిన్నియాపోలిస్‌ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం ప్రమాదానికి గురైందని పియర్సన్‌ ఎయిర్‌పోర్టు ఎక్స్‌(ట్విటర్‌)లో చేసిన ఒక పోస్టులో ధృవీకరించింది. విమానం తిరగబడి ఎయిర్‌పోర్టులో పడి ఉన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

 

Advertisement
 
Advertisement
Advertisement