‘‘నా స్నేహితుల్లో చాలామంది చనిపోయారు’’ | Delhi Hotel Fire A Lot of My Friends Died Guinea National | Sakshi
Sakshi News home page

‘‘నా స్నేహితుల్లో చాలామంది చనిపోయారు’’

Jun 4 2026 9:20 PM | Updated on Jun 4 2026 9:24 PM

Delhi Hotel Fire A Lot of My Friends Died Guinea National

ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో ఉన్న ఫ్లోరిష్ స్టేస్‌లో బస చేసిన గినియా పౌరుడు హోటల్ అగ్నిప్రమాదం తర్వాత హృదయ విదారక అనుభవాన్ని తెలిపాడు. తన స్నేహితుల్లో పలువురిని కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. వారిలో చికిత్స నిమిత్తం భారత్‌కు వచ్చిన ఓ నైజీరియా రోగి, అతని తల్లి కూడా ఉన్నారని తెలిపాడు.

ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘‘నేను 2 నెలల క్రితం ఫ్లోరిష్ స్టేస్‌కు వచ్చాను. నేను, నా తండ్రి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్స కోసం ఇక్కడికి వచ్చాం. శనివారం మాక్స్ హాస్పిటల్‌లో చేరాం. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో మేము ఈ హోటల్‌లో లేము. నేను, నా తండ్రి ఆస్పత్రిలో ఉన్నాం. 

నిన్న ఈ హోటల్‌లో ఏమి జరిగిందో నాకు తెలుసు. నా స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు. ఈ హోటల్‌లో చాలా మంది చనిపోయినట్లు చూశాను. నా స్నేహితుల్లో చాలామంది చనిపోయారు. నైజీరియాకు చెందిన నా ఓ స్నేహితుడు తన తల్లితో కలిసి క్యాన్సర్ చికిత్స కోసం ఇక్కడికి వచ్చాడు. అతను చనిపోయాడు. అతని తల్లి కూడా చనిపోయింది. కాంగోకు చెందిన ఇద్దరు కూడా చికిత్స కోసం వచ్చారు. 

ఓ వ్యక్తి, అతని భార్య మాక్స్ హాస్పిటల్‌లో చికిత్స కోసం వచ్చారు. వారు కేవలం ఒక వారం మాత్రమే ఈ హోటల్‌లో ఉన్నారు. అతను కూడా చనిపోయాడు. నాలుగో అంతస్తులో చాలా మంది చనిపోయారు. కాంగోకు చెందిన ఆ ఇద్దరూ అక్కడే ఉన్నారు. మిగిలిన వారు కూడా నాలుగో అంతస్తులోనే, నా గది పక్కనే ఉన్నారు. నా గది చిన్నది కాదు.. పెద్దదే. వాష్‌రూమ్ కూడా ఉంది. అన్నీ బాగున్నాయి. కిటికీ కూడా ఉంది. గాజు కిటికీ ఉంది. దానికి తాళం కూడా ఉంది’’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement