రబ్రీ దేవికి ఢిల్లీ కోర్టు నోటీసులు

Delhi court summons former Bihar CM Rabri Devi, daughter Misa Bharti - Sakshi

న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఢిల్లీ కోర్టు బిహార్‌ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కూతుళ్లు మిసా భారతి, హేమా యాదవ్‌లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన కోర్టులో విచారణకు రావాలంటూ స్పెషల్‌ కోర్టు జడ్జి విశాల్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వేసిన చార్జిషీటులో ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్‌ నుంచి జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్‌ కట్యాల్‌ను సైతం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top