ఢిల్లీ ఎయిర్‌పోర్టులో  ఒక రన్‌వే మూసివేత | Delhi airport runway to be shut for 3 months for Repairs | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో  ఒక రన్‌వే మూసివేత

Jun 8 2025 6:20 AM | Updated on Jun 8 2025 6:20 AM

Delhi airport runway to be shut for 3 months for Repairs

సాక్షి, న్యూఢిల్లీ: స్వల్ప మరమత్తులుసహా ఆధునీకరణ పనుల్లో భాగంగా దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 28/10 నంబర్‌ రన్‌వేను మూసివేయనున్నారు. దీంతో రోజూ కనీసం 200 విమానసర్వీసులు రద్దుకా నున్నాయి. ఇందులోభాగంగా 114 విమానసర్వీస్‌ లను క్యాన్సల్‌చేసి మరో 86 విమానాలను రీషెడ్యూల్‌ చేయనున్నారు. జూన్‌ 15వ తేదీ నుంచి మూడు నెలలపాటు అంటే సెప్టెంబర్‌ 15వ తేదీదాకా రన్‌వే పై ల్యాండింగ్, టేకాఫ్‌లను నిలిపివేయనున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ సంస్థ అయిన ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌(డీఐఏఎల్‌) శుక్రవారం ప్రకటించింది. 

కేటగిరీ(క్యాట్‌)3బీ ప్రమాణాలకు అనుగుణంగా రన్‌వేపై ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటుచేయనున్నారు.  గాల్లోంచి కిందకు దిగుతూ 15 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాక కూడా విమాన పైలెట్‌కు మంచు, వర్షం వంటి పరిస్థితుల్లో రన్‌వే స్పష్టంగా కనబడకపోతే ల్యాండింగ్‌ చేయడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లోనూ ల్యాండింగ్‌ సాధ్యమయ్యేలా రన్‌వే వెంట అప్రోచ్, టచ్‌డౌన్‌ లైట్లు, అధునాతన సిగ్నల్, వాయిస్‌ ప్రాప్ట్‌ల వ్యవస్థలను ఏర్పాటుచేస్తారు. నెలల తరబడి ఏకధాటిగా ఒకే ప్రాంతంలో వందల విమానాల ల్యాండింగ్‌ కారణంగా దెబ్బతిన్న రన్‌వే ప్రాంతాన్ని పునరుద్ధరించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement