ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఎయిర్‌పోర్టు ఏటీసీ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా 500పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల ఆలస్యంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రద్దీ పెరిగింది. సాంకేతిక సమస్యను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ చేసిన విమానాలు రద్దు చేశారు.
ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టం పనిచేయడం లేదు. మాన్యువల్ డేటాతో విమాన రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఢిల్లీ నుంచి ప్రతిరోజూ 1500 విమానాల రాకపోకలు సాగిస్తుంటాయి. సైబర్ దాడి జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సైబర్ అటాక్ వార్తలను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ధ్రువీకరించలేదు.


