breaking news
runway maintenance work
-
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఒక రన్‌వే మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ: స్వల్ప మరమత్తులుసహా ఆధునీకరణ పనుల్లో భాగంగా దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 28/10 నంబర్ రన్‌వేను మూసివేయనున్నారు. దీంతో రోజూ కనీసం 200 విమానసర్వీసులు రద్దుకా నున్నాయి. ఇందులోభాగంగా 114 విమానసర్వీస్ లను క్యాన్సల్చేసి మరో 86 విమానాలను రీషెడ్యూల్ చేయనున్నారు. జూన్ 15వ తేదీ నుంచి మూడు నెలలపాటు అంటే సెప్టెంబర్ 15వ తేదీదాకా రన్‌వే పై ల్యాండింగ్, టేకాఫ్‌లను నిలిపివేయనున్నట్లు ఎయిర్పోర్ట్ నిర్వహణ సంస్థ అయిన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(డీఐఏఎల్) శుక్రవారం ప్రకటించింది. కేటగిరీ(క్యాట్)3బీ ప్రమాణాలకు అనుగుణంగా రన్‌వేపై ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటుచేయనున్నారు. గాల్లోంచి కిందకు దిగుతూ 15 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాక కూడా విమాన పైలెట్‌కు మంచు, వర్షం వంటి పరిస్థితుల్లో రన్‌వే స్పష్టంగా కనబడకపోతే ల్యాండింగ్ చేయడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లోనూ ల్యాండింగ్ సాధ్యమయ్యేలా రన్‌వే వెంట అప్రోచ్, టచ్‌డౌన్ లైట్లు, అధునాతన సిగ్నల్, వాయిస్ ప్రాప్ట్ల వ్యవస్థలను ఏర్పాటుచేస్తారు. నెలల తరబడి ఏకధాటిగా ఒకే ప్రాంతంలో వందల విమానాల ల్యాండింగ్ కారణంగా దెబ్బతిన్న రన్‌వే ప్రాంతాన్ని పునరుద్ధరించనున్నారు. -
ముంబై ఎయిర్ పోర్టు మూసివేత
ముంబై: దేశ వాణిజ్య రాజధానిలోని విమానాశ్రయం నుంచి టికెట్ నుంచి బుక్ చేసుకున్నారా, ఈ రోజు ముంబై ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారా.. అయితే మీ ప్రయాణం ఆలస్యం కావొచ్చు. ఎందుకంటే సోమవారం మధ్యాహ్నం నుంచి 5 గంటల పాటు విమానాశ్రయం మూసివేయనున్నారు. రన్ వే మెయింటెనెన్స్ పనుల నిమిత్తం ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ఎయిర్ పోర్టును మూసివేయనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని విమానయాన సంస్థలు, పైలట్లకు ముందుగానే తెలిపారు. ఈ షెడ్యూల్ కు అనుగుణంగా విమాన సర్వీసులు నడపాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కోరారు. మూసివేత ప్రభావం సాయంత్రం విమాన రాకపోకలపై పడనుంది. ముంబై విమానాశ్రయం నుంచి 1600పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇందులో ఎక్కువ దేశీయ సర్వీసులు. అయితే అక్టోబర్ 18న మొదలైన నిర్వహణ పనులు నవంబర్ చివరి వారంలో ముగుస్తాయని ఎయిర్ పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. ఈరోజు రన్ వే మూసివేస్తున్నందున విమాన రాకపోకలకు అంతరాయం కలగనుందని చెప్పారు.