breaking news
runways closed
-
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఒక రన్‌వే మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ: స్వల్ప మరమత్తులుసహా ఆధునీకరణ పనుల్లో భాగంగా దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 28/10 నంబర్ రన్‌వేను మూసివేయనున్నారు. దీంతో రోజూ కనీసం 200 విమానసర్వీసులు రద్దుకా నున్నాయి. ఇందులోభాగంగా 114 విమానసర్వీస్ లను క్యాన్సల్చేసి మరో 86 విమానాలను రీషెడ్యూల్ చేయనున్నారు. జూన్ 15వ తేదీ నుంచి మూడు నెలలపాటు అంటే సెప్టెంబర్ 15వ తేదీదాకా రన్‌వే పై ల్యాండింగ్, టేకాఫ్‌లను నిలిపివేయనున్నట్లు ఎయిర్పోర్ట్ నిర్వహణ సంస్థ అయిన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(డీఐఏఎల్) శుక్రవారం ప్రకటించింది. కేటగిరీ(క్యాట్)3బీ ప్రమాణాలకు అనుగుణంగా రన్‌వేపై ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటుచేయనున్నారు. గాల్లోంచి కిందకు దిగుతూ 15 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాక కూడా విమాన పైలెట్‌కు మంచు, వర్షం వంటి పరిస్థితుల్లో రన్‌వే స్పష్టంగా కనబడకపోతే ల్యాండింగ్ చేయడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లోనూ ల్యాండింగ్ సాధ్యమయ్యేలా రన్‌వే వెంట అప్రోచ్, టచ్‌డౌన్ లైట్లు, అధునాతన సిగ్నల్, వాయిస్ ప్రాప్ట్ల వ్యవస్థలను ఏర్పాటుచేస్తారు. నెలల తరబడి ఏకధాటిగా ఒకే ప్రాంతంలో వందల విమానాల ల్యాండింగ్ కారణంగా దెబ్బతిన్న రన్‌వే ప్రాంతాన్ని పునరుద్ధరించనున్నారు. -
యూఏఈలో అనూహ్య వర్షాలు
దుబాయ్: మాడ పగిలిపోయే ఎండ వేడికి, ఎడారులకు నిలయమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను భారీ వర్షాలు పలకరించాయి. బుధవారం కుండపోత వర్షాలతో యూఏఈ తడిసి ముద్దయింది. భారీ వర్షాలను తట్టుకునే ఏర్పాట్లేవీ పెద్దగా లేకపోవడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే మొత్తం నీట మునిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా ఖ్యాతికెక్కిన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్రాంతంలోని కార్లు మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకటిన్నర సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం బుధవారం ఒక్కరోజే నమోదైందని సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. 14.2 సెంటీమీటర్లమేర వర్షపాత నమోదైందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసేశారు. సమీప బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాల్లోనూ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన ఆస్తినష్టాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. వర్షాల కారణంగా భారత్ నుంచి దుబాయ్‌కు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మేఘమథనం వల్లే ఈ వర్షాలు కురిశాయని నిపుణుల అంచనా. -
నేపాల్‌లో రన్‌వేపై కూలిన విమానం..68 మంది మృత్యువాత
ఖాట్మాండు: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్‌లోని పోఖారా విమానాశ్రయంలో రన్‌వేపై విమానం కులిపోయింది. కాగా, విమానంలో నలుగురు సిబ్బందితో సహా 72 మంది ఉన్నారు. విమానం ఖాట్మాండు నుంచి పోఖారా వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక, ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలిపోవడంతో విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. నేపాల్ ఆర్మీ.. ఇప్పటి వరకు 68 మంది ప్రయాణికుల డెడ్‌బాడీలను బయటకు తీశారు. ఇందులో ఐదుగురు భారతీయులున్నట్లు గుర్తించారు. ఎయిర్‌పోర్టులో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. A 72-seater passenger aircraft crashes on the runway at Pokhara International Airport in Nepal. Rescue operations are underway and the airport is closed for the time being. Details awaited. pic.twitter.com/Ozep01Fu4F — ANI (@ANI) January 15, 2023 #Watch: Aircraft with 68 passenger crashes on the runway at Pokhara International Airport in #Nepal. Rescue operations are underway and the airport is closed for the time being.#TYPNews pic.twitter.com/Fdpk2zqCKj — Jammu Kashmir News Network 🇮🇳 (@TheYouthPlus) January 15, 2023 -
రన్‌వే మూశారు..చార్జీలు పెంచారు!
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలోని మూడు రన్వేలలో ఒకదాన్ని మూసివేయడంతో ప్రయాణికులపై అదనపు భారం పడింది. దీనికి తోడు వారాంతంలో డిమాండ్ పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు టికెట్ల ధరలు గరిష్టంగా 86 శాతం పెరిగాయి. ఒక రన్‌వేను మరమ్మతుల నిమిత్తం 13 రోజుల పాటు మూసివేశారు. దీని వల్ల విమానాల రాకపోకలు 50 వరకు తగ్గనున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లే విమానాల చార్జీలు దాదాపు 57 శాతం పెరిగాయి. -
80 రోజులపాటు దుబాయ్‌కు విమానాల్లేవు!
న్యూఢిల్లీ: అభివద్ధి పనులు చేపడుతున్న కారణంగా ఈ రోజు నుంచి 80 రోజుల పాటు దుబాయ్ విమానాశ్రయానికి విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని రెండు రన్‌వేలను అభివద్ధి చేసే నిమిత్తం 80 రోజుల పాటు మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగా దుబాయ్‌కు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య 26 శాతానికి తగ్గిపోనున్నాయి.ఈ నిర్ణయంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, జెట్ ఎయిర్వేస్ తదితర సంస్థలు దుబాయ్‌కు నడిపే తమ విమాన సర్వీసులను షార్జా ఎయిర్‌పోర్టుకు మార్చాయి. మరికొన్ని సర్వీసుల సమయాలను మార్పు చేశాయి. ఇండిగో, దుబాయ్ ఎమీరేట్స్ సంస్థలు దుబాయ్ విమాన సర్వీసులను కుదించాయి. మరికొన్ని సర్వీసులను రీషెడ్యూల్ చేశాయి. ఎయిర్ఇండియాకు చెందిన చెన్నై-దుబాయ్, విశాఖపట్నం-హైదరాబాద్-దుబాయ్ విమానాలను షార్జాకు మార్చారు. ప్రస్తుతం నడిచే తమ విమాన సర్వీసుల సమయాల గురించి ప్రయాణికులు తమని అడిగి తెలుసుకోవాలని ఇండిగో అధికార ప్రతినిధి చెప్పారు. ఇతర విమాన సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి.