
రూ.62,370 కోట్లతో 97 తేజస్ ఎంకే–1ఏ ఫైటర్ జెట్ల కొనుగోలు
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో రక్షణ శాఖ ఒప్పందం
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) మరింత శక్తివంతంగా మారనుంది. అత్యాధు నిక యుద్ధ విమానాల రాకతో ఐఏఎఫ్ కొత్త తేజస్సును సంతరించుకోనుంది. ఏకంగా 97 తేజస్ ఎంకే–1ఏ తేలికపాటి యుద్ధ విమా నాల(ఎల్‌సీఏ) కొనుగోలుకు హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో భార త రక్షణ శాఖ గురువారం ఒప్పందం కుదు ర్చుకుంది. ఈ ఒప్పందం విలువ పన్నులు మినహా రూ.62,370 కోట్లు.
తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నెల రోజుల క్రితమే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. 2027–28 నుంచి యుద్ధ విమానాల అప్పగింత ప్రారంభమవు తుంది. ఆరేళ్లలోగా మొత్తం విమానాలను రక్షణ శాఖకు హెచ్‌ఏఎల్ అప్పగించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో 68 ఫైటర్ జెట్లు, 29 ట్విన్ సీటర్ విమానాలు ఉన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించాయి.
ఏటా 11,750 మందికి ఉద్యోగాలు, ఉపాధి
ప్రభుత్వ రంగంలోని హెచ్‌ఏఎల్‌తో ఇలాంటి భారీ ఒప్పందం కుదుర్చుకోవడం ఇది రెండోసారి. 2021 ఫిబ్రవరిలో రూ.48,000 కోట్లతో 83 తేజస్ ఎంకే–1ఏ ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం హెచ్‌ఏఎల్‌తో రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. 2021 కంటే ఈసారి తయారు చేయబోతున్న ఫైటర్ జెట్లు మరింత ఆధునికమైనవి. ఇందులో 64 శాతం దేశీయ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానమే ఉంటుంది.
అదనంగా 67 పరికరాలు చేర్చ బోతున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌ను చేర్చనున్నారు. ప్రతి ఏటా ప్రత్యక్షంగా, పరోక్షంగా 11,750 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తా యని అంచనా. మొత్తం ఆరేళ్లపాటు ఒప్పందం అమల్లో ఉంటుంది. ఆత్మనిర్భర్ లక్ష్యాని కి ఇదొక ప్రతీక అని అధికార వర్గాలు అభి వర్ణించాయి. ఆరు దశాబ్దాలకుపైగా సేవ లందించిన మిగ్–21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలుకుతూ వాటి స్థానంలో తేజస్ ఎంకే–1ఏ ఫైటర్ జెట్లను ప్రవేశపెట్టబో తున్నారు.
నేడు మిగ్–21 జెట్లకు వీడ్కోలు
ఘనమైన చరిత్ర కలిగిన మిగ్–21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. శుక్రవారం బైబై చెప్పబో తున్నారు. చండీగఢ్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వేదిక కానుంది.