సీఎం పదవి మళ్లీ మిస్‌: డీసీఎం | DCM G Parameshwara Emotional Speech on Losing CM Post | Sakshi
Sakshi News home page

సీఎం పదవి మళ్లీ మిస్‌: డీసీఎం

Jun 10 2026 11:21 AM | Updated on Jun 10 2026 11:48 AM

 DCM G Parameshwara Emotional Speech on Losing CM Post

నాకు గతంలో 3 సార్లు సీఎం పదవి తప్పిపోయింది అని కొత్త డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ వాపోయారు. తుమకూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావాలనే తన చిరకాల కోరిక ఇంకా అలాగే  ఉందని ఉద్వేగానికి గురయ్యారు. 2013 ఎన్నికల్లో పార్టీ గెలిచినా, తాను ఓడిపోవడం వల్ల ముఖ్యమంత్రి పదవి తప్పిపోయిందని, ఆనాడు తాను గెలిచి ఉంటే సిద్ధరామయ్య సీఎం అయ్యేవారు కాదని తెలిపారు. 

2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 80 స్థానాల్లో గెలుపొందినా మైత్రి సర్కార్‌ కారణంగా హెచ్‌డీ కుమారస్వామి సీఎం అయ్యారన్నారు. ఈసారి కూడా సీఎం పదవి తనకు రావాల్సి ఉన్నా, వివిధ రాజకీయ కారణాల వల్ల సాధ్యపడలేదని అన్నారు. ఇటీవల ఢిల్లీలో సీఎం పదవి ఇవ్వకపోతే వెంటనే చెప్పేయాలని, తనకు అవతల చాలా పనులు ఉన్నాయని హైకమాండ్‌కు చెప్పేశానన్నారు. 

-కర్ణాటక 

Advertisement
 
Advertisement
Advertisement