కరోనా: భారీ రికవరీ, అంతకుమించి కేసులు | Coronavirus Recoveries In India Nearly 70000 Daily | Sakshi
Sakshi News home page

కరోనా: భారీ రికవరీ, అంతకుమించి కేసులు

Sep 13 2020 9:02 AM | Updated on Sep 13 2020 9:29 AM

Coronavirus Recoveries In India Nearly 70000 Daily - Sakshi

ప్రతిరోజూ 70 వేలకు పైగా కోవిడ్‌ బాధితులు కోలుకుంటున్నారని వెల్లడించింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసుల సంఖ్య 3.8 రెట్లు అధికంగా ఉందని తెలిపింది. 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ కేసుల నమోదు కూడా అదే స్థాయిలో ఉధృతమవుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 97,570 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 46,59,984 కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో కరోనా బారినపడ్డవారిలో ఇప్పటివరకు 36 లక్షల మంది కోలుకున్నారని తెలిపింది. ప్రతిరోజూ 70 వేలకు పైగా కోవిడ్‌ బాధితులు కోలుకుంటున్నారని వెల్లడించింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసుల సంఖ్య 3.8 రెట్లు అధికంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 10,71,702 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని, మొత్తం పరీక్షల సంఖ్య 5,62,60,928 చేరిందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది.
(చదవండి: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ జెట్‌)


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement