కోరలు చాస్తున్న కరోనా.. భారత్‌లో ఒక్కరోజులో లక్షదాటిన కేసులు

Corona Virus Positive Cases Crossed One Lakh: Covid Updates In India - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తుంది. కరోనా కేసుల సంఖ్య లక్షను దాటింది.  గడిచిన 24 గంటలలో కొత్తగా 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 302 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. గడిచిన ఒక్కరోజులో అక్కడ 36,265 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
  ప్రస్తుతం దేశంలో  3,71,363 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై బులెటిన్‌ను విడుదల చేసింది. 

గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 30,836 మంది, కరోనా మొదలైనప్పటి నుంచి మొత్తంగా 3,43,71,845 మంది వైరస్‌ బారినుంచి కోలుకున్నారు.  పాజిటివిటీ రేటు 7.74 శాతంగా ఉంది. తాజాగా నమోదైన 302 మరణాలతో మొత్తం భారత్‌లో 4,83,178 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా 149 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్ని అందించినట్లు కేంద్రం ప్రకటించింది. 

ఒమిక్రాన్‌ అప్‌డేట్‌
ఇదిలా ఉంటే 27 రాష్ట్రాల్లో 3, 007 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని, వారిలో 1,199 మంది పేషెం‍ట్లు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  

చదవండి: ఒమిక్రాన్‌ ముప్పు: ఆశలన్నీ బూడిదపాలు.. వారంలో 200 కోట్ల నష్టం!!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top