Congress Leader Navya Shree Shocking Comments On Rajkumar Takale, Details Inside - Sakshi
Sakshi News home page

Navya Shree: అశ్లీల వీడియో తీసి వెబ్‌సైట్‌కు అమ్మాడు.. సమాజంలో నా పరువు తీశాడు

Jul 24 2022 4:22 AM | Updated on Jul 24 2022 12:43 PM

Congress Leader Navya Shree Comments on Rajkumar Takale - Sakshi

నవ్యశ్రీ  

మొదటి భార్య ఉండగానే నన్ను కిడ్నాప్‌ చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. అశ్లీల వీడియో తీసి వెబ్‌సైట్‌కు అమ్మాడు. సమాజంలో నా పరువు తీశాడు అని ఆమె ఆరోపణలు గుప్పించారు.

సాక్షి, బెంగళూరు(యశవంతపుర): ఉద్యానవన శాఖ అధికారి రాజకుమార టాకళెతో పెళ్లి, తనపై మోసం, బ్లాక్‌మెయిల్‌ కేసుకు సంబంధించి బెళగావి కాంగ్రెస్‌ నాయకురాలు నవ్యశ్రీ స్పందిస్తూ దీని వెనుక చన్నపట్టణకు చెందిన కాంగ్రెస్‌ నేత హస్తం ఉందన్నారు. ఆమె శనివారం బెళగావిలో విలేకరులతో మాట్లాడారు. తాను విదేశాలలో ఉన్న సమయంలో సోషల్‌ మీడియాలో చెడుగా పోస్టులుపెట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్న వేళ, టాకళె ఆ వెంటనే బెళగావి ఎపిఎంసి పోలీసులకు నాపై ఫిర్యాదు చేశాడన్నారు.

తనను టాకళె 2020లో బెంగళూరులో కుమారకృపా గెస్ట్‌ హౌస్‌ వెనుకనున్న గణేశ్‌ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అతనే నా భర్త. అతడి వల్ల నాకు అన్యాయం జరిగింది, గతంలో టాకళెపై బెళగావి మహిళా పోలీసుస్టేషన్‌లో రెండుసార్లు ఫిర్యాదు చేశాను. మొదటి భార్య ఉండగానే నన్ను కిడ్నాప్‌ చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. అశ్లీల వీడియో తీసి వెబ్‌సైట్‌కు అమ్మాడు. సమాజంలో నా పరువు తీశాడు అని ఆమె ఆరోపణలు గుప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement