వాణిజ్య ఎల్పీజీ ధర తగ్గింపు | Commercial LPG prices cut by Rs 183 per refill | Sakshi
Sakshi News home page

వాణిజ్య ఎల్పీజీ ధర తగ్గింపు

Jul 2 2026 5:23 AM | Updated on Jul 2 2026 5:24 AM

Commercial LPG prices cut by Rs 183 per refill

న్యూఢిల్లీ: వాణిజ్య ఎల్పీజీ ధర తగ్గింది. 19 కిలోల సిలిండర్‌పై రూ.183.50 చొప్పున తగ్గిస్తూ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. వాణిజ్య ఎల్పీజీపై ఈ ఏడాది ఇదే మొదటి తగ్గింపు కావడం విశేషం. సిలిండర్‌ ధర గత నెలలో రూ.3,113 ఉండగా, ప్రస్తుతం రూ.2,930కి పడిపోయింది. అలాగే 5 కిలోల ఫ్రీ ట్రేడ్‌ ఎల్పీజీ(ఎఫ్‌టీఎల్‌) సిలిండర్‌ ధరను రూ.13 చొప్పున తగ్గించారు.

సిలిండర్‌ ధర రూ.808.50కు చేరుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, గ్యాస్‌ ధరలు క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఎవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయెల్‌(ఏటీఎఫ్‌) ధరను సైతం లీటర్‌కు రూ.5 చొప్పున తగ్గించారు. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.110కు చేరింది. ఇదిలా ఉండగా, నయారా ఎనర్జీ కంపెనీ లీటర్‌ డీజిల్‌ ధరను రూ.3, పెట్రోల్‌ ధరను రూ.5 చొప్పున తగ్గించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement