నకిలీ వెబ్‌సైట్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి

CJI Chandrachud warns of fake Supreme Court website - Sakshi

సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సూచన  

న్యూఢిల్లీ:  సైబర్‌ నేరగాళ్లు సుప్రీంకోర్టువెబ్‌సైట్‌ను కూడా వదిలిపెట్టలేదు. నకిలీ వెబ్‌సైట్‌ రూపొందించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ న్యాయవాదులను, కక్షిదారులను గురువారం సూచనలు జారీ చేశారు. నకిలీ వెబ్‌సైట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.  సుప్రీంకోర్టు సైతం పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వెబ్‌సైట్‌ లింక్‌లపై క్లిక్‌ చేయొద్దని, షేర్‌ చేయొద్దని వెల్లడించింది.

అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను సైబర్‌ నేరగాళ్లు రూపొందించారని, యూఆర్‌ఎల్‌లో అందుబాటులో ఉంచారని తెలిపింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా వ్యక్తిగత, రహస్య సమాచారం సేకరించి, మోసగించే ప్రమాదం ఉందన్నారు. లాయర్ల, కక్షిదారుల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని, ఆర్థిక లావాదేవీల వివరాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎప్పుడూ కోరదని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది.   ఠీఠీఠీ.టఛిజీ.జౌఠి.జీn అనే వెబ్‌సైట్‌ మాత్రమే అసలైనదని స్పష్టం చేసింది. ఒకవేళ సైబర్‌ దాడి బారినపడితే బ్యాంకు ఆన్‌లైన్‌ ఖాతాల పాస్‌వర్డ్‌లు వెంటనే మార్చుకోవాలని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top