breaking news
public notice
-
రికార్డులు, ప్రకటనల్లో కులం ప్రస్తావన ఉండరాదు
లక్నో: పోలీసు రికార్డుల్లో కుల ప్రస్తావన అభ్యంతరకర పరిణామాలకు దారి తీస్తోందంటూ అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తదనుగుణంగా చర్యలకు ఉపక్రమించింది. పోలీసు రికార్డులతోపాటు పబ్లిక్ నోటీసుల్లో ఎటువంటి కుల ప్రస్తావన ఉండరాదని స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనాలపై కులం ఆధారితంగా స్టిక్కర్లు, నినాదాలను ప్రదర్శించరాదని కూడా తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు, జిల్లా యంత్రాంగాలకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కులపరమైన వివక్షను తొలగించాలంటూ ఈ నెల 16వ తేదీన హైకోర్టు వెలువరించిన ఆదేశాల మేరకు ఈ చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపింది. పోలీసు రిజిస్టర్లు, కేస్ మెమోలు, అరెస్ట్ డాక్యుమెంట్లతోపాటు పోలీస్ స్టేషన్లలో పెట్టే నోటీస్ బోర్డుల్లోనూ కుల ప్రస్తావన ఉండరాదని చీఫ్ సెక్రటరీ దీపక్ కుమార్ ఆ ఉత్తర్వులో తెలిపారు. రాష్ట్ర క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్ఎస్) పోర్టల్లోనూ కులానికి సంబంధించిన కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలన్నారు. పోలీసు రికార్డుల్లో నిందితుల పేర్ల వద్ద తల్లిదండ్రుల ఇద్దరి పేర్లను జత చేయాలన్నారు. వాహనాలపై కులానికి సంబంధించిన స్టిక్కర్లు, నినాదాలను ప్రదర్శించే వారిపై చలాన్లు విధించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. పట్టణాలు, గ్రామాల్లో కులాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ ఏర్పాటు చేసే బోర్డులను తొలగించాలన్నారు. ఈ వీధి లేదా ఈ ప్రాంతం ఫలానా కులానికి చెందినదంటూ బోర్డులను ఏర్పాటు చేయరాదన్నారు. రాజకీయ లాభాపేక్షతో కులం పేరుతో ర్యాలీలు, బహిరంగ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయరాదన్నారు. కులాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌పైనా నిఘా ఉంచుతామన్నారు. కులాధారిత శత్రుత్వాన్ని ప్రచారం చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు లోబడి పై ఆదేశాలకు అనుగుణంగా అధికారులు తక్షణమే స్పందించాలని, దిగువ స్థాయి అధికారులకు ఈ విషయంలో తగు శిక్షణను కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. -
కాకి లెక్కలు కుదరవ్!
సాక్షి, అమరావతి: ‘నేరం నాదే..! దర్యాప్తు నాదే..! తీర్పూ నాదే..!’ అంటూ మొండికేస్తున్న ఈనాడు రామోజీకి సుప్రీంకోర్టు గట్టి మొట్టికాయలు వేసింది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా సేకరించిన డిపాజిట్లను తిరిగి డిపాజిట్‌దారులకు చెల్లించేశామని, తమ ఆడిటర్లు ఈ లెక్కలు తేల్చేశారంటూ నమ్మబలుకుతున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్కు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. ఆ విషయాన్ని నిర్దారించాల్సింది మార్గదర్శి ఆడిటర్లు కాదని, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ధ్రువీకరించాలని తేల్చి చెప్పింది. దీంతో రామోజీ గొంతులో పచ్చి వెలగకాయ పడింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బహిరంగ ప్రకటన జారీ చేసి అభ్యంతరాలు స్వీకరణకు సన్నద్ధం కానుండటం రామోజీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చెల్లించేశాం.. లెక్క తేల్చేశాం: రామోజీ వితండవాదం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన కేసులో చెరుకూరి రామోజీరావు అడ్డగోలు వాదనలు సుప్రీంకోర్టులో ఫలించలేదు. 2023 జూన్ 30 నాటికి 1,247 మంది డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని, కేవలం రూ.5.31 కోట్లు మాత్రమే అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఆయన న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. ఈ విషయాన్ని మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆడిటర్లు క్షుణ్ణంగా ఆడిట్ చేసి నివేదిక సమర్పించారని, అన్ని లెక్కలు సరిపోయాయని చెప్పుకొచ్చారు. అందువల్ల మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్‌దారులు, చెల్లింపుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు. తద్వారా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో అక్రమంగా డిపాజిట్ చేసినవారి పేర్లు, ఆ డిపాజిట్ మొత్తాల వివరాలు బయటకు రాకుండా చేసేందుకు రామోజీ ప్రయాస పడ్డారు. అక్రమ డిపాజిట్ల వెనుక భారీగా నల్లధనం దాగి ఉండటమే దీనికి కారణం. అదేం కుదరదు... నిగ్గు తేలాల్సిందే.. రామోజీ తరపు న్యాయవాదుల వాదనలను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. ‘డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని మీరు చెబితే సరిపోదు. మీ దగ్గర పని చేసే ఆడిటర్ల నివేదికను పరిగణలోకి తీసుకోలేం’ అని స్పష్టం చేసింది. డిపాజిట్‌దారులకు న్యాయం జరిగిందో లేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ధారించాలని పేర్కొంది. ‘రూ.5 వేలు డిపాజిట్ చేసిన వ్యక్తి తనకు న్యాయం జరగలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు.. అంతటి వ్యయ ప్రయాసలు భరించలేరు కదా..!’ అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను పార్టీగా చేరుస్తూ ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించాలని తీర్పునిచ్చింది. డిపాజిట్లు తిరిగి చెల్లించారో లేదో పరిశీలించేందుకు ఓ జ్యుడిషియల్ అధికారిని నియమించాలని ఆదేశించింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. బహిరంగ ప్రకటన.. అభ్యంతరాల స్వీకరణ సుపీం్ర కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించిన అక్రమ డిపాజిట్లను సంబంధిత డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనే డిపాజిట్‌దారులు అత్యధికంగా ఉన్నారు. వారి ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్ అధికారిని సంప్రదించి బహిరంగ ప్రకటన జారీ చేసేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేయనున్నాయి. అగ్రిగోల్డ్ కేసులో మాదిరిగానే ఈ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంది. బహిరంగ ప్రకటన జారీ చేసి డిపాజిట్‌దారులకు సమస్యలుంటే నివేదించాలని కోరనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు. డిపాజిట్లు తిరిగి చెల్లించకుంటే ఆ సెల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. వీటిని క్రోడీకరించి తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడతాయి. ఇక రామోజీ డిపాజిట్లు చెల్లించేశామని చెబుతున్న వారి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలను జ్యుడీషియల్ అధికారితోపాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేయాలి. వాటిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ నోటీసు ద్వారా విడుదల చేస్తాయి. అందులోని డిపాజిట్‌దారుల పేర్లు, చెల్లింపుల వివరాలను పరిశీలిస్తాయి. వాటిపై వ్యక్తమయ్యే అభ్యంతరాలపై విచారణ చేపడతాయి. అనంతరం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నివేదికల ఆధారంగా జ్యుడీషియల్ అధికారి తదుపరి చర్యలు తీసుకుంటారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆరు నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. ఇరు ప్రభుత్వాలు బహిరంగ నోటీసు ఇవ్వడంతో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు దిశగా వేగంగా చర్యలు చేపట్టాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. -
నకిలీ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండండి
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టువెబ్సైట్ను కూడా వదిలిపెట్టలేదు. నకిలీ వెబ్సైట్ రూపొందించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయవాదులను, కక్షిదారులను గురువారం సూచనలు జారీ చేశారు. నకిలీ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సుప్రీంకోర్టు సైతం పబ్లిక్ నోటీసు జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వెబ్సైట్ లింక్‌లపై క్లిక్ చేయొద్దని, షేర్ చేయొద్దని వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు రూపొందించారని, యూఆర్ఎల్లో అందుబాటులో ఉంచారని తెలిపింది. ఈ వెబ్సైట్ ద్వారా వ్యక్తిగత, రహస్య సమాచారం సేకరించి, మోసగించే ప్రమాదం ఉందన్నారు. లాయర్ల, కక్షిదారుల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని, ఆర్థిక లావాదేవీల వివరాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎప్పుడూ కోరదని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. ఠీఠీఠీ.టఛిజీ.జౌఠి.జీn అనే వెబ్సైట్ మాత్రమే అసలైనదని స్పష్టం చేసింది. ఒకవేళ సైబర్ దాడి బారినపడితే బ్యాంకు ఆన్లైన్ ఖాతాల పాస్వర్డ్లు వెంటనే మార్చుకోవాలని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. -
సెల్ఫీలు దిగితే క్రిమినల్ కేసు.. నోటిఫికేషన్ విడుదల
సెల్ఫీల మోజులో ఆపదలను కొని తెచ్చుకోవడం సర్వసాధారణంగా మారింది. ప్రపంచంలో ప్రతీ ఏటా నమోదు అవుతున్న సెల్ఫీ మరణాల్లో.. మన దేశం వాటా ఎక్కువగానే ఉంటోంది. పైగా వర్షాకాలం సీజన్లో టూరిస్ట్ ప్రాంతాలకు క్యూ కడుతుండడం వల్ల ఇవి మరింత ఎక్కువగా నమోదు అవుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ జిల్లాలో సెల్ఫీలపై పూర్తి నిషేధం విధించారు. సూరత్: గుజరాత్‌లోని దంగ్ జిల్లా అధికారులు సెల్ఫీలను నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు ఫైన్‌తో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సాత్పుర లాంటి టూరిస్ట్ ప్రదేశాల్లో సెల్ఫీలు దిగడం తీవ్ర నేరంగా పరిగణిస్తామని ఆ నోటిఫికేషన్లో అధికారులు హెచ్చరించారు. ఈమేరకు జూన్ 23నే అదనపు కలెక్టర్ పేరిట పబ్లిక్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నీటి ప్రవాహాల ప్రాంతాలను సెల్ఫీ బ్యాన్ ఏరియాలుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వర్షాకాలం కావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున.. బట్టలు ఉతకడం, ఈత, స్నానం చేయడం నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో 2019లో వాఘై-సాపుతరా హైవేపై సెల్ఫీలను దిగడం నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావిస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించడమనే వంకతో.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కరోనా నిషేధాజ్ఞలు ఎత్తివేయడంతో ప్రస్తుతం దంగ్ టూరిస్ట్ ప్రాంతాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫీ నిషేధాజ్ఞలు జారీ కావడం కొసమెరుపు. ఇక ఈ స్ఫూర్తితో తమ దగ్గర ఇలాంటి ఇలాంటి చట్టం తేవాలని కేరళలోని టూరిస్ట్ ప్రాంతాల ఊర్లు కొన్ని డిమాండ్ చేస్తుండడం విశేషం. చదవండి: ఫోన్ చోరీ.. సెల్ఫీలు చూసి వ్యక్తి షాక్! -
ఎన్నికలను వాయిదా వేయలేం: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: ఫిబ్రవరి ఏడున జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయటం కుదరదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ల దాఖలు గడువు తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం పబ్లిక్ నోటీసు ఇవ్వకపోవటం వల్ల ఎక్కువమంది ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారని రాష్ట్ర నిర్మాణ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విభు భక్రు తీర్పు చెప్పారు. ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ నిర్ధారిత సమయంలోనే విడుదల అయిందని, సరైన ప్రక్రియ ద్వారానే పోల్ పానెల్ తేదీలను నిర్ణయించిందని, ఎన్నికల నిర్వహణ జరుగుతోందనీ, అందువల్ల ప్రజాధనం కూడా వృథా కాలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.